Goru Chuttu : మన వేళ్లకు అందమే కాదు రక్షణ కూడా మన గోర్లే. గోర్లను సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. లేదంటే గోరు చుట్టు సమస్య తలెత్తే అవకాశం ఉంది. గోరు చుట్టు సమస్య కారణంగా వచ్చే నొప్పి, బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య ప్రమాదకరం కానప్పటికి ప్రాణం తీసేంత నొప్పిని మాత్రం కలిగిస్తుంది. కొన్ని రకాల చిట్కాల ద్వారా మనం గోరు చుట్టు సమస్య నుండి బయటపడవచ్చు. గోరు చుట్టు సమస్య తెల్తిన వెంటనే వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి నొన్ని ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి వెంటనే తగ్గుతుంది.
గోరు చుట్టు వల్ల కలిగే నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ మంచి సున్నాన్ని తీసుకుని దానికి సమానంగా పసుపును కలిపి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరు చుట్టుపై వేసి కట్టు కట్టడం వల్ల నొప్పి, వాపు తగ్గడమే కాకుండా గడ్డ పగిలి సమస్య కూడా తగ్గుతుంది. కొండపిండి ఆకులను, వెల్లుల్లి రెబ్బలను, లవంగాలను కలిపి మెత్తగా నూరి గోరు చుట్టు ఉన్న వేలు మీద ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల గోరు చుట్టు సమస్య తగ్గుతుంది. నిమ్మకాయకు రంధ్రం చేసి దానిలో గోరు చుట్టు ఉన్న వేలిని దూర్చి ఉంచాలి. ఇలా చేయడం వల్ల నొప్పి సలపడం తగ్గుతుంది. మునగాకును మెత్తగా నూరి గోరు చుట్టుపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డలు త్వరగా పక్వానికి వచ్చి సమస్య తగ్గుతుంది. లేత గుమ్మడి ఆకులను ఏడింటిని తీసుకుని గోరు చుట్టు పై ఒకదాని మీద ఒకటి ఉంచి కట్టు కట్టాలి.
ఇలా చేయడం వల్ల కూడా గోరు చుట్టు సమస్య తగ్గుతుంది. పచ్చి పసుపును మెత్తగా నూరి గోరు చుట్టుపై పట్టులా వేసి పలుచని నూలు వస్త్రంతో కట్టు కట్టాలి. ఆ కట్టు పైన పసుపు నీళ్లను పోసి తడుపుతూ ఉంటే గోరు చుట్టు సమస్య తగ్గుతుంది. ఒక కప్పులో కిరనాయిల్ పోసి గోరు చుట్టు ఉన్న వేలును అందులో ముంచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా గోరు చుట్టు వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇలా పదే పదే చేయడం వల్ల సమస్య తగ్గుతుంది. పసుపును ముద్దగా చేసి గోరు చుట్టుపై ఉంచి కట్టు కట్టాలి. దీనిని పసుపు నీళ్లతో తడుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, వాపు తగ్గడంతో పాటు సమస్య నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల గోరు చుట్టు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.