Lemon Peel For Weight Loss : అధిక బరువు.. ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మనం గుండెపోటు, బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత వంటి ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి.
వేగంగా బరువు తగ్గడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. డైటింగ్ పద్దతులను పాటించడం, వ్యాయామాలు చేయడం, బరువు తగ్గించే మందులు వాడడం, అన్నం తీసుకోవడం మానేయడం.. ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన కొందరిలో ఎటువంటి ఫలితం ఉండదు. అయితే వేగంగా బరువు తగ్గాలనుకునే వారు నిమ్మతొక్కలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం సాధారణంగా నిమ్మరసాన్ని తీసి తొక్కలను పాడేస్తూ ఉంటాము. నిమ్మరసం మాత్రమే మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తాము.
కానీ నిమ్మతొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వాడడం వల్ల అధిక బరువు సమస్య తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా నిమ్మతొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు నిమ్మతొక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఒక గిన్నెలో మూడు నిమ్మతొక్కలను తీసుకుని ఒకటిన్నర గ్లాస్ నీటిని పోయాలి.
తరువాత ఈ నీటిని ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన నీటిని రోజూ ఉదయం పరగడుపున అలాగే మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఈవిధంగా తయారు చేసిన నిమ్మతొక్కల నీటిని రోజూ రెండు పూటలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.