Salt In Shampoo : నల్లని, ఒత్తైనా జుట్టును ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టే మనకు చక్కని అందాన్ని ఇస్తుంది. జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాలుష్యం, పోషకాహార లోపం, వంశపారపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల ఔషధాలు తదితర కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అందమైన, ఒత్తైన కురులను సొంతం చేసుకోవచ్చు. తల మీద లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. అందులో సాధారణంగానే సుమారు వంద వరకు వెంట్రుకలు ప్రతిరోజూ రాలిపోతుంటాయి. అయితే పరిమితి మించితేనే జుట్టు రాలడం సమస్య తలెత్తుతుంది. ఎక్కువ సంఖ్యలో జుట్టు రాలితేనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. వయసు పై బడుతున్న కొద్ది వెంట్రుకల మూలాలు కుశించుకుపోతుంటాయి.
కొత్త వెంట్రుకల ఉత్పత్తి కూడా ఆగి పోతుంది. దాంతో బట్టతల వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది. పోషకాలు అందకపోవడం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. వాస్తవానికి ఎక్కువ మందిలో జుట్టు రాలడానికి ఇదే కారణం. అలాగే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువగా విడుదల కావడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. చుండ్రు వంటి ఫంగల్ ఇన్ ఫెక్షన్ ల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును నల్లగా ఒత్తుగా పెంచుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించుకోవడం కోసం మనం ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీనికోసం మనం నిత్యం వాడే షాంపులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. వెంట్రుకల ఎదుగుదలకు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉప్పును స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మృత కణాలను తొలగిస్తుంది. జుట్టును రెండు భాగాలుగా చేసి తలపై ఉప్పును చల్లాలి. తరువాత తడి వేళ్లతో 10 నుండి 15 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
అలాగే తలలో అధధిగా ఉన్న నూనెను కూడా ఉప్పు పీల్చుకుంటుంది. మృత కణాలు కూడా తొలగిపోతాయి. అలాగే నూనెలో ఉప్పును కలిపి తలకు రాసుకోవాలి. తరువాత కొద్ది సేపు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన జుట్టు రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో జుట్టు ముందు కంటే ఎక్కువ త్వరగా పెరుగుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల జుట్టుకు తగినన్ని పోషకాలు లభించడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు ధృడంగా, కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది.