Heart Lines In Hand : మీ చేతి రేఖ‌లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌ట్లే..!

Heart Lines In Hand : ఎవ‌రి జీవితం ఎలా ఉంటుందో చాలా మంది చేతులు చేసే చెప్పేస్తూ ఉంటారు. ఆ వ్య‌క్తి ఎప్పుడు పెళ్ల‌వుతుంది.. ఎంత మంది పిల్ల‌లు.. అవ్ మ్యారేజా.. ఆరెంజ్డ్ మ్యారేజా.. డ‌బ్బులు సంపాదిస్తాడా.. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయా.. ఇలా ఎన్నో ర‌కాలుగా భ‌విష్య‌త్తును ముందే చెబుతుంటారు. చెయ్యి చూసి జాత‌కాన్ని చెప్ప‌డాన్ని పామిస్ట్రీ అంటారు. ఈ శాస్త్రాన్ని మ‌న పూర్వీకులు బాగా న‌మ్మేవారు. ఇది మ‌న దేశంలోనే కాకుండా టిబెట్, చైనా, ర‌ష్యా , బాబిలోనియా, సుమేరియా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో చాలా ప్రాచుర్యంలో ఉన్న శాస్త్రం. చెయ్యి చూసి జాత‌కం చెప్పే వారు సాధార‌ణంగా ఐదు గీత‌ల‌పై దృష్టి పెడ‌తారు.

లైఫ్, హార్ట్, ఫేట్, మ్యారేజ్, హెడ్ అనే ఈ ఐదు గీత‌ల ఆధారంగానే భ‌విష్య‌త్తు గురించి విశ్లేషిస్తారు. రెండు చేతుల‌ను ఒక దాని ప‌క్క‌కు మ‌రొక‌టి పెట్టినప్పుడు రెండు చేతుల్లోని హార్ట్ లైన్ క‌లిసి అర్థ చంద్రాకారం ఏర్ప‌డితే దాని ప్ర‌భావం ఎలా ఉంటుంది… ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయి.. అని తెలుసుకోవ‌చ్చ‌ట‌. మ‌న‌ రెండు చేతులు క‌లిపినప్పుడు వ‌చ్చే ఆకారాన్ని బ‌ట్టి మ‌న వ్య‌క్తిత్వాన్ని, మ‌న భ‌విష్య‌త్తును తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఈ ఆకారం మ‌న వ్య‌క్తిత్వాన్ని, మ‌న భ‌విష్య‌త్తును ఎలా నిర్దారిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బొట‌న వేలు కాకుండా మిగిలిన నాలుగు వేళ్లు భూమి, నీరు, అగ్ని, గాలికి సంకేతంగా భావిస్తారు. చేతిలో ఉండే ఐదు గీత‌లు చాలా ముఖ్య‌మైన‌వి. ఈ గీత‌ల ఆధారంగానే భ‌విష్య‌త్తును అంచ‌నా వేస్తారు.

Heart Lines In Hand if you have like this then know what happens
Heart Lines In Hand

చిటికెన వేలు కింద మొద‌లై చూపుడు వేలు వ‌ర‌కు ఉండే దానిని హార్ట్ లైన్ అంటారు. దీనినే ల‌వ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వ్య‌క్తి భావాల‌ను, శారీర‌క సంబంధాల‌ను వివ‌రిస్తుంది. ఈ హార్ట్ లైన్ ను రెండు చేతుల్లోనూ గ‌మ‌నిస్తే ఒకేలా ఉంటాయి. కొంత‌మందికి వేరువేరుగానూ ఉంటాయి. ఈ హార్ట్ లైన్ ఒక్కొక్క‌రికి ఒక్కోలా ఉండ‌డ‌మే కాదు ఒకే వ్య‌క్తికి ఒకే చేతిలో ఒక్కోలా కూడా ఉంటుంది. మీ రెండు అర చేతుల‌ను దగ్గ‌రికి క‌లిపిన‌ప్పుడు రెండు చేతుల్లోని హార్ట్ లైన్ క‌లిస్తే అది ఒక్కొక్క‌రికి ఒక్కో ఆకారంలో క‌నిపిస్తుంది. స్ట్రెయిట్ గా లేకుండా చూడ‌డం, స్ట్రెయిట్ గా లైన్ ఏర్ప‌డ‌డం, అర్థ చంద్రాకారంలో ఇలా ఒక్కోలా ఏర్ప‌డ‌డం జ‌రుగుతుంది.

రెండు చేతుల‌ను క‌లిపిన‌ప్పుడు రెండు చేతుల హార్ట్ లైన్ క‌లిసి స్ట్రెయిట్ గా ఒక గీత‌లా ఏర్ప‌డితే వారు చాలా ప్ర‌శాంత త‌త్వం క‌లిగి ఉంటారు. జాలి క‌లిగి ఉంటారు. సున్నిత స్వ‌భావం క‌లిగి ఉంటారు. ఇలా స్ట్రెయిట్ లైన్ క‌లిగిన వారు ఆరెంజ్డ్ మార్యేజ్ చేసుకుంటారు. పెద్ద‌లు చూసిన వివాహం చేసుకుని సెటిల్ అవుతారు. అలాగే హార్ట్ లైన్స్ ను ఒక ద‌గ్గ‌ర పెట్టిన‌ప్పుడు అస్థ‌వ్య‌స్థంగా లైన్ ఏర్ప‌డితే వాళ్లు జీవితంలో ఒడిదుడుకులు ఎదురుకుంటారు. జీవితంలో వివిధ దారుల్లో పోతుంటారు. ఒక ప‌ద్ద‌తి పాటించ‌రు.

ప్ర‌తి ఒక్క‌రిని త‌మ‌కు ద‌గ్గ‌రిగా ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఇలాంటి అస్థ‌వ్య‌స్థ‌మైన గీత ఉన్న‌వారు 80 శాతం వాళ్ల కంటే కొద్దిగా పెద్ద‌వాళ్ల‌ను పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డుతుంటారు. ఇక రెండు చేతులు క‌లిసిన‌ప్పుడు అర్థ‌చంద్రాకారంలో గీత ఏర్ప‌డితే చాలా స్ట్రాంగ్ మైండ్ క‌లిగి ఉంటారు. స్వీయ ధృడ‌మైన వ్య‌క్తిత్వం క‌లిగి ఉంటారు. అర్ధ‌చంద్రాకారంలో గీత ఉన్న వారు చాలా ప్రేమ క‌లిగి ఉంటారు. కానీ ఇత‌రుల నుండి ఏమి ఆశించ‌రు. అఆగే వీరు చాలా ఆక‌ర్ష‌ణీయంగా, అందంగా ఉంటారు. వీళ్లు వారి చిన్న నాటి స్నేహితుల‌తోనే జీవితాన్ని పంచుకునే అవ‌కాశం ఉంది.

D

Recent Posts