Skin Allergy : చాలా మంది చర్మ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ముఖ్యంగా వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు కూడా వానా కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు వస్తే చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే నిజానికి అలా చేయక్కర్లేదు. సులభంగా మనం స్కిన్ ఎలర్జీలని తగ్గించుకోవచ్చు. స్కిన్ ఎలర్జీలని ఎలా తగ్గించుకోవచ్చు..? వీటికి ఎలా సులభంగా పరిష్కారం దొరుకుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఒక్కొక్కసారి చర్మంపై దురద కలుగుతూ ఉంటుంది. దద్దుర్లు వంటివి కూడా కలుగుతూ ఉంటాయి. చర్మం ఎర్రగా మారడం, మంట కలగడం, వాపు ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు చాలా మంది మందులు వేసుకుంటూ ఉంటారు. ఎలర్జీ తగ్గేంత వరకు ప్రతిరోజు కూడా మందులు వేసుకుంటూ ఉంటారు. దాంతో మత్తుగా ఉంటుంది. అంతే కాక ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతూ ఉంటాయి.
ఇలాంటి ఎలర్జీలని తగ్గించడానికి తోటకూర బాగా పని చేస్తుంది. తోటకూరను తీసుకుంటే ఎలర్జీలు తగ్గిపోతాయి. స్కిన్ ఎలర్జీలను తగ్గించేందుకు తోటకూర బాగా సహాయ పడుతుంది. సహజంగా ఎలర్జీలని తోటకూర తగ్గించగలదు. ఇలా తోటకూరతో అనేక సమస్యలని మనం దూరం చేసుకో వచ్చు.
కాబట్టి ఎలాంటి ఎలర్జీలు ఉన్నా కూడా తోటకూరతో తగ్గించుకోవచ్చు. స్కిన్ ఎలర్జీలతో బాధపడే వాళ్ళు వేప నూనె తీసుకుని ఎలర్జీలు, దద్దుర్లు, వాపు ఉన్న చోట అప్లై చేసుకుంటే మంచిది. స్కిన్ ఎలర్జీలని ఇలా వేప నూనెతో తగ్గించుకోవచ్చు. వేప నూనెలో ఉండే విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలోకి లోతుగా వెళ్లి పోషణ ఇచ్చేలా చేస్తాయి. వేప నూనె చర్మం రక్షిత పొరను కూడా పునరుద్ధరిస్తుంది. తేమ నష్టాన్ని కూడా ఇది తగ్గించగలదు.