Lakshmi Devi : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కారణం ఏదైనా కావచ్చు.. డబ్బు సమస్య అనేది ప్రతి ఒక్కరికీ వస్తోంది. అయితే కొందరు మాత్రం ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవడం లేదని భావిస్తుంటారు. అలాంటి వారితోపాటు ఆర్థిక సమస్యలు ఉన్నవారు కింద చెప్పిన విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. దీంతో కోరిన కోరికలు నెరవేరడమే కాదు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ధనం బాగా సంపాదిస్తారు. మరి అందుకు ఏం చేయాలంటే..
మీ ఇంట్లో పూజ గదిలో శ్రీయంత్రాన్ని స్థాపించాలి. రోజూ ఆ యంత్రానికి పూజ చేయాలి. పూజగదిలో శ్రీయంత్రాన్ని ఉంచి రోజూ దానికి పూజ చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు.
పూజ గదిలో ముత్యపు శంఖువును ఉంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.
లక్ష్మీదేవి చిత్ర పటం ముందు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నెయ్యితో దీపాలను వెలిగించి పూజలు చేయాలి. దీంతో కూడా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కలసి లక్ష్మీదేవి పూజ చేయడం, లక్ష్మీదేవికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం.. వంటి పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో ధనం బాగా సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.