చిట్కాలు

ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను ఇలా తినండి.. అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవీ ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవి కాలం అంటేనే మామిడి కాయల సీజన్ అని అందరికి తెలుసు&period; అయితే మామిడి పండ్లను తినడానికి అందరు ఇష్టపడతారు&period; లేదా మామిడి జ్యూస్ లు తాగుతారు&period; కాని పచ్చి మామిడి కాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; అయితే పచ్చి మామిడి కాయ పచ్చడి చేయటానికి లేదా పప్పులో వేసుకోవడానికి వాడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి మన ఆరోగ్యాన్ని చాలా బాగా రక్షిస్తుంది&period; పచ్చి మామిడి మన శరీరం లో జీవక్రియల‌ను వేగవంతం చేసి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది&period; మలబద్దకాన్ని నివారిస్తుంది&period; ఇంకా వాంతులు&comma; వికారం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి&period; మామిడి కాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది&period; దానితో పాటు విటమిన్ ఏ&comma; మెగ్నీషియం కూడా ఉంటాయి&period; పచ్చి మామిడి తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది&period; మన నోటిలోని పళ్ళు పుచ్చి పోకుండా కాపాడుతుంది&period; ఇంకా నోటి దుర్వాసన&comma; చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71802 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;raw-mango&period;jpg" alt&equals;"take raw mango like this for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి కాయలో సోడియం క్లోరైడ్ &comma; ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది&period; మామిడి కాయను పరిశుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి&period; పచ్చి మామిడి కాయ పై తోలును మెత్తగా నూరి మజ్జిగలో కలిపి రోజుకి 2&comma; 3 సార్లు తాగితే విరోచనాలు&comma; పైల్స్ తగ్గిపోతాయి&period; పచ్చి మామిడి ముక్కలలో తేనె&comma; మిరియాల పొడి కలిపి తింటే కాలేయం చక్కగా పని చేస్తుంది&period; వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది&period; అయితే పచ్చి మామిడి కాయ అతిగా కూడా తినకూడదు&period; అతిగా తినడం వల్ల గొంతు నొప్పి&comma; అజీర్తి&comma; కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి&period; పచ్చి కాయను తిన్న వెంటనే చల్లని నీరు త్రాగరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts