Throat Infection : గొంతులో ఇన్ఫెక్ష‌న్‌, మంట‌, దుర‌ద‌.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుత‌మైన చిట్కా..!

Throat Infection : చ‌లికాలంలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు గ‌ర‌గ‌ర‌, గొంతులో ఇన్ఫెక్ష‌న్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. అన్నీ కాలాల్లో ఈ స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికి చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. గొంతు నొప్పి కార‌ణంగా మ‌నం ఆహారాన్ని కూడా తీసుకోలేక‌పోతుంటాం. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్ ల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డుతుంటాం. గొంతు బొంగురు పోవ‌డం, మాట్లాడుతుంటే నొప్పిగా ఉండ‌డం, టాన్సిల్స్ నొప్పిగా ఉండ‌డం వంటి ఇత‌ర ఇబ్బందుల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటూ ఉంటాం. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి చాలా మంది యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ ఉంటారు.

వీటిని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌ట్టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. గొంతు ఇన్ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌నం ఇంటి చిట్కాల ద్వారా కూడా న‌యం చేసుకోవ‌చ్చు. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను వాడి క‌షాయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. గొంతు ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి.

Throat Infection home remedy in telugu
Throat Infection

ఇందులోనే అర టీ స్పూన్ ప‌సుపును వేసి క‌లపాలి. త‌రువాత ఇందులో బ్లాక్ సాల్ట్ ను లేదా రాళ్ల ఉప్పును వేసి క‌లపాలి. ఈ నీటిని ఎక్కువ సేపు మ‌రిగించ‌కుండా గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. త‌రువాత ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. గొంతులో దుర‌ద‌, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఇందులో తేనెను వేసి కూడా క‌లుపుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న నీటిని ఉద‌యం అలాగే సాయంత్రం రెండు పూట‌లా గొంతులో పోసుకుని 5 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఈ గ్లాస్ మిశ్ర‌మం అంతా అయిపోయే వ‌ర‌కు ఇలాగే చేయాలి. ఇలా పుక్కిలించిన త‌రువాత‌ అర గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు.

అయితే బీపీ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఇందులో ఉప్పుకు బ‌దులుగా తుల‌సి ఆకుల‌ను వేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, గొంతు గ‌ర‌గ‌ర‌, గొంతు దుర‌ద‌, గొంతులో క‌ఫం, గొంతు ఇన్ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈ చిట్కా త‌యారీలో ఉప‌యోగించిన ప‌దార్థాల‌న్నీ కూడా యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా గొంతు స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts