Egg Dosa Recipe : మనలో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అప్పుడప్పుడు దోశలను కూడా తింటుంటారు. వీటిల్లో అనేక రకాల దోశలు ఉంటాయి. మసాలా దోశ, ఉల్లి దోశ.. ఇలా భిన్న రకాల దోశలను ఎవరైనా సరే తమ ఇష్టాలకు అనుగుణంగా తింటుంటారు. అయితే ఎగ్ దోశలను కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ ప్రియులు ఎగ్ దోశలను ఒక పట్టుపడతారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – రెండు గరిటెలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, పసుపు, మిరియాల పొడి, కారం – ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు, గుడ్డు – ఒకటి.
ఎగ్ దోశను తయారు చేసే విధానం..
కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి. పాన్ వేడి చేసి నూనె రాసి రెండు గరిటెల దోశ పిండి వేయాలి. దోశ మీద కారం, మిరియాల పొడి చల్లాలి. ఇప్పుడు గుడ్డును పగలగొట్టి దోశ మీద వేసి దోశ అంతా పరచాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లాలి. మిగిలిన కారం పొడిని గుడ్డు సొన మీద వేసి ఉల్లిపాయ ముక్కలను కూడా చల్లాలి. దోశ చుట్టూ నూనె కొద్దిగా వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఎగ్ దోశ రెడీ అవుతుంది. చట్నీ అవసరం లేకుండా నేరుగా కూడా దీన్ని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.