Turmeric For Weight Loss : ప‌సుపుతో ఈ చిట్కాల్లో దేన్న‌యినా పాటించండి చాలు.. అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గిపోతుంది..

Turmeric For Weight Loss : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. నిత్యం అనేక వంట‌ల్లో ప‌సుపును వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప‌రంగా ప‌సుపుతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఎంతో కాలం నుంచి ప‌సుపును ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపును ఉప‌యోగించి ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తున్నారు. అయితే ప‌సుపుతో అధిక బ‌రువును చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌సుపులో క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది వృక్ష సంబంధిత పాలిఫినాల్స్ జాతికి చెందుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. ఒక పాత్ర తీసుకుని అందులో ఒక‌టిన్న‌ర క‌ప్పు నీళ్ల‌ను పోయాలి. కాస్త ప‌సుపు వేయాలి. నీళ్లు ఒక క‌ప్పు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. దీంతో ప‌సుపు టీ త‌యార‌వుతుంది. ఇందులో కాస్త తేనె క‌లిపి ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగాలి. ఇది తాగిన త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తిన‌రాదు. ఇలా చేస్తుంటే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.

Turmeric For Weight Loss follow these remedies
Turmeric For Weight Loss

ప‌సుపులాగే అల్లం కూడా యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక బ‌రువు త‌గ్గ‌డాన్ని ప్రోత్స‌హిస్తుంది. దీన్ని ప‌సుపుతో క‌లిపి తీసుకుంటే బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. ఒక గ్లాస్ నీటిలో కాస్త అల్లం వేసి మ‌రిగించాలి. నీరు మ‌రిగాక స్ట‌వ్ ఆఫ్ చేసి అందులో కాస్త ప‌సుపు వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ప‌ర‌గ‌డుపునే తాగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు.

ఇక రాత్రి పూట ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని పాల‌లో కాస్త ప‌సుపు క‌లిపి రోజూ తాగుతున్నా కూడా అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా తాగితే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే క‌ఫం మొత్తం పోతుంది. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది. క‌నుక ఈ మూడు చిట్కాల్లో దేన్ని పాటించినా చాలు.. అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

Editor

Recent Posts