Banana For Piles : చాలా మంది, ఈ మధ్యకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, ఈ రోజుల్లో పైల్స్ తో కూడా బాధపడుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఎప్పుడు కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అది మనం సరిగ్గా జీర్ణం అయ్యేటట్టు చూసుకోవాలి. అది పూర్తిగా జీర్ణం అయిపోయి, మన పొట్ట ఎప్పుడూ కూడా క్లీన్ గా ఉండాలి. అలా శుభ్రంగా లేకపోతే, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అరుగుదల శక్తి లోపించడం వలన మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వచ్చింది కదా అని ఇక్కడతో ఈ సమస్య ఆగిపోదు.
మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటే, అది పైల్స్ కి దారితీస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన, ఇలా రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోతే, పైల్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పైల్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫైల్స్ రాకుండా ఉండాలంటే, ప్రతి రోజు కూడా తగినన్ని నీళ్లు తాగాలి. దాని వలన పైల్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలానే, పైల్స్ సమస్యకు చెక్ పెట్టాలంటే బాగా పండిన అరటి పండుని రాత్రి పూట తినండి.
ఇలా తీసుకోవడం వలన, కడుపులో పేర్కొన్న గ్యాస్ మొత్తం పోతుంది. డైజషన్ కూడా సాఫీగా సాగుతుంది. ఫైబర్ అరటి పండ్లలో ఎక్కువ ఉంటుంది. మలబద్ధకం సమస్య నుండి ఇది బయట పడేస్తుంది. మొలలు కూడా రాకుండా చూస్తుంది. మొలల సమస్య కూడా తగ్గుతుంది. అరటిపండుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఒక ప్లేట్లో వేసుకుని తర్వాత పచ్చ కర్పూరాన్ని వేసుకుని తీసుకోవాలి. పచ్చ కర్పూరాన్ని దంచుకుని చిటికెడు అరటిపండు ముక్కల్లో వేసి, కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
ప్రతి రోజు భోజనానికి, ఒక గంట ముందు అరటిపండు ముక్కల్ని తీసుకోవాలి. దీనిని ఎప్పటికప్పుడు మీరు వేసుకోవాలి. ఒకేసారి వేసుకుని దాచుకోవడానికి అవ్వదు. మీరు కేవలం రెండు, మూడు రోజులు ఇలా తింటే సరిపోతుంది. ఇలా తినడం వలన పైల్స్ వలన కలిగే అసౌకర్యం కూడా తగ్గుతుంది. పొట్ట క్లీన్ అవుతుంది. మీరు తినే ఆహారంలో కచ్చితంగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు ఈ సమస్య ఉండదు.