Home Tips

Banana Storage : ఇలా చేస్తే.. 15 రోజులైనా అరటిపండ్లు పాడవ్వవు.. ఫ్రెష్ గానే ఉంటాయి..!

Banana Storage : చాలామంది, అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని రెగ్యులర్ గా, అరటి పండ్లను తింటుంటారు. అరటిపండు తినడం వలన, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అవుతుంది. అయితే, అరటి పండ్లు త్వరగా పాడైపోతుంటాయి. ఎక్కువ కొని, మనం వాటిని స్టోర్ చేసుకోవడానికి, త్వరగా అవి పాడైపోతాయి. అయితే, ఎక్కువ కాలం పాటు అవి తాజాగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక, మీరు చేసినట్లయితే, అరటి పండ్లు 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి.

మామూలుగా మనం ఇంట్లో అరటి పండ్లను తెచ్చి పెట్టుకుంటే, రెండు మూడు రోజులకు అవి పాడైపోతాయి. కుళ్లిపోతాయి. అలా కాకుండా, మీరు ఈ విధంగా అరటిపండు ని పెట్టినట్లయితే అరటి పండ్లు తాజాగా ఉంటాయి. కొన్ని చిట్కాలు ని పాటిస్తే, ఎప్పుడు కూడా అవి ఫ్రెష్ గానే ఉంటాయి. పూర్తిగా పండిన పసుపు అరటి పండ్లను కొనడానికి బదులుగా, కొన్ని పండిన అరటిపండ్ల ని, కొన్ని ఆకుపచ్చ పండ్లను కొనండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు.

you can store bananas like this for days

క్రమంగా అరటి పండ్లు ముగ్గుతూ ఉంటాయి. మీరు సగం పండిన అరటి పండ్లను తెచ్చుకొని, వాటిని ఇంట్లో పెట్టుకుంటే, నెమ్మదిగా అవి ముగ్గుతాయి. ఫ్రెష్ గా ఉంటాయి. అలానే, అరటి పండ్లను నిల్వ చేసేటప్పుడు, సరిగ్గా నిల్వ చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే సంచి నుండి పండ్లను బయటకు తీసేయండి.

అరటి పండ్లు సంచిలో ఉంటే, వేగంగా పండిపోతాయి. కుళ్లిపోతాయి. అలానే, నేరుగా వేడికి లేదంటే సూర్య రష్మికి గురి అవ్వకుండా జాగ్రత్త వహించండి. అరటి పండ్లు ని గ్యాస్ స్టవ్లు, హీటర్లు, కిటికీలకి దూరంగా ఉంచాలి. తెచ్చిన వెంటనే చల్లని ప్రదేశంలో పెట్టాలి. పండిన పండ్లు ని ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి, సీల్ చేసి ఫ్రిజ్లో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే అరటి పండ్లు పాడైపోవు.

Admin

Recent Posts