Thamara : ప‌సుపుతో ఇలా చేస్తే.. తామ‌ర మ‌టుమాయం.. మ‌ళ్లీ రాదు..!

Thamara : మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో తామ‌ర కూడా ఒక‌టి. తామ‌ర అనేది ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా వ‌చ్చే ఒక చ‌ర్మ వ్యాధి. తామ‌ర శ‌రీరంలో ఎక్క‌డైనా రావ‌చ్చు. తామ‌ర వ‌చ్చిన చోట చ‌ర్మం ఎర్ర‌గా మార‌డంతో పాటు దుర‌ద కూడా వ‌స్తుంది. ఇది ఒక‌రి నుండి మ‌రొక‌రికి సుల‌భంగా వ్యాపిస్తుంది. తామ‌ర వ‌చ్చిన వ్య‌క్తుల‌ను తాక‌డం లేదా వారి వాడిన వ‌స్తువుల‌ను వాడ‌డం, వారు ధ‌రించిన దుస్తుల‌ను ధ‌రించ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల తామ‌ర వ్యాధి వ్యాప్తిస్తుంది. ఈ తామ‌ర వ్యాధిని మ‌నం కొన్ని ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి సులభంగా త‌గ్గించుకోవ‌చ్చు. తామ‌ర‌ను త‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తామ‌ర‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. ఇవి తామ‌రను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని జార్ లో వేయాలి. త‌రువాత ఇందులో కొన్నినీళ్లు వేసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసిన వెల్లుల్లి మిశ్ర‌మంలో దూదిని ముంచి తామ‌ర ఉన్న చోట రాయాలి. ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల తామ‌ర వ్యాధి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. తామ‌ర‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ప‌సుపును వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. తామ‌ర‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి.

use turmeric in this method to get rid of Thamara
Thamara

ఇవి తామ‌ర వంటి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఒక గిన్నెలో ప‌సుపును తీసుకుని అందులో నీటిని క‌లిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి ప‌డుకునే ముందు తామ‌ర ఉన్న చోట చ‌ర్మం పై లేప‌నంగా రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. తామ‌ర‌ను త‌గ్గించ‌డంలో వెనిగ‌ర్ కూడా మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. దీనికోసం ఒక గిన్నెలో ఒక‌టిన్న‌ర టీ స్పూన్ ఉప్పును వేయాలి. త‌రువాత ఇందులో కొద్దిగా వెనిగ‌ర్ ను వేసి పేస్ట్ లా క‌లుపుకోవాలి. ఈ పేస్ట్ ను తామ‌ర ఉన్న చోట రాయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల తామ‌ర వ్యాధి కొద్ది రోజుల్లోనే త‌గ్గిపోతుంది. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా స‌లుభంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా తామ‌ర వ్యాధి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts