చిట్కాలు

Yellow Teeth : మూడంటే మూడే నిమిషాల్లో ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను తెల్లగా మార్చే చిట్కా..!

Yellow Teeth : ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాల సైజు స‌రిగ్గా లేద‌ని కొంద‌రు.. దంతాలు స‌రిగ్గా పెర‌గ‌డం లేద‌ని కొంద‌రు.. ప‌సుపు, గార‌తో ఉన్నాయ‌ని కొంద‌రు బాధ‌ప‌డుతున్నారు. అయితే మిగిలిన స‌మ‌స్య‌లు ఎలా ఉన్నా స‌రే.. ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను మాత్రం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా కష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మూడంటే మూడు నిమిషాల్లోనే మీ ప‌సుపు రంగు దంతాలు తెల్ల‌గా మారుతాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి. దాంట్లో నిమ్మరసం పిండి బాగా కలపాలి. కలిపిన తర్వాత నురగలు పోయే వరకు ఆగి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దంతాల‌పై వేళ్లతో కానీ.. పేపర్ లేదా దూదితో కానీ రుద్దాలి. త‌రువాత 5 నిమిషాల పాటు అలాగే ఉండాలి. అనంత‌రం నోట్లో నీళ్ల‌ను పోసి బాగా శుభ్రం చేయాలి. ఇలా త‌రచూ చేయాల్సి ఉంటుంది.

your yellow teeth become white if you follow this remedy

అయితే ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ప‌సుపు రంగులో ఉండే దంతాలు తెల్ల‌గా మారుతాయి. ప‌సుపు ద‌నం త‌క్కువ‌గా ఉంటే చాలా త్వ‌ర‌గానే ఈ చిట్కా ప‌నిచేస్తుంది. కానీ ప‌సుపు ద‌నం, గార అధికంగా ఉంటే మాత్రం ఎక్కువ సార్లు ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. దీంతో దంతాలు తెల్ల‌గా మిల‌మిలా మెరుస్తాయి. అలాగే దంతాలు, చిగుళ్లు, నోటి స‌మ‌స్య‌లు ఉండవు. దంతాల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. చిగుళ్లు దృఢంగా ఉంటాయి.

Admin

Recent Posts