Get Rid Of Mosquitoes : దోమల వలన, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే, చాలామంది రకరకాల ఇంటి చిట్కాలను, పాటిస్తూ ఉంటారు. దోమలు ఇంట్లో ఉండడం వలన మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. దోమలని వదిలించుకోవడానికి, చాలా మంది సహజసిద్ధమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. మస్కిటో కాయిల్స్ వంటి వాటికి బదులుగా సహజసిద్ధమైన పద్ధతుల్ని పాటించడం వలన, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా కలగవు. సహజ సిద్దమైన పద్ధతుల ద్వారా, దోమలను తరిమి కొట్టడానికి అవుతుంది. పైగా సమస్యలు కూడా తలెత్తవు.
సీజన్ ఏదైనా, దోమలు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ని సరిగా పాటించినట్లయితే, ఈజీగా దోమల నుండి బయటపడొచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే, మనం ఈజీగా దోమల్ని తరిమికొట్టడానికి అవుతుంది. ఈ పదార్థాలు ఇంట్లో ఉంటాయి. కాబట్టి, పెద్దగా కష్టపడక్కర్లేదు. మట్టి మూకుడు తీసుకొని, రెండు బిర్యానీ ఆకుల్ని ముక్కలు కింద కట్ చేసి వేయండి.
అందులోనే మీరు నలుగు లవంగాలని, నాలుగు కర్పూరం బిళ్ళలను వేయండి. అలానే ఒక పుదీనా టాబ్లెట్ లోని ఆయిల్ వేసి, మంట వెలిగించండి. ఇలా చేశాక పొగ వస్తుంది. ఈ పొగతో దోమలన్నీ కూడా పారిపోతాయి. పుదీనా టాబ్లెట్ దోమల్ని తరిమి కొట్టడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. లవంగాలు, కర్పూరం కూడా దోమల్ని పోగొడతాయి. ఎక్కువగా దోమలు ఉన్నచోట, ఇలా పొగ వేస్తే సులభంగా దోమలు పారిపోతాయి.
అసలు దోమల బాధే ఉండదు. చాలా మంది, ఇళ్లల్లో దోమలు ఎక్కువైపోయి సతమతమవుతూ ఉంటారు. కానీ ఈ చిన్న చిట్కాతో, ఈజీగా ఐదే నిమిషాల్లో దోమల్ని పారిపోయేలా చేసేయొచ్చు. మరి ఇక ఈసారి ఈ టెక్నిక్ ని ఫాలో అయిపోండి. దోమల బాధ ఉండదు.