ఆధ్యాత్మికం

Do Not Give These Items : రాత్రి పూట పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను ఎవ‌రికీ ఇవ్వ‌కండి..!

Do Not Give These Items : భారతదేశం అంటే సకల సాంప్రదాయాలు కలిసి విలసిల్లే దేశం. ఇక్కడ సాంప్రదాయాలతోపాటు అనేక మూఢాచారాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఇందులో కొన్ని ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది.. ఇప్పటికీ మనం అలాంటి ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దానధర్మాలు చేస్తే పుణ్యఫలాలు వస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను అస్సలు దానం చేయకూడదు, ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయడం చాలా శుభకరమని చెబుతారు. కానీ సూర్యాస్తమయం తర్వాత పెరుగును ఎప్పుడు దానమివ్వకూడదు. ఎందుకంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి ఇవి దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు తొలగిపోతుంది. క‌నుక పెరుగును సాయంత్రం పూట ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దు.

do not give these items to others at night

అలాగే సంధ్యా సమయం తర్వాత పాలు దానం చేయకూడ‌దు. పాలు సూర్యుడు-చంద్రుడు ఇద్దరికీ సంబంధించినదిగా చెప్పాలి. సాయంకాలంలో వీటిని దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి, శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది.

అలాగే సూర్యాస్తమయం తర్వాత డబ్బు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఇవ్వ‌కూడదు. ఈ సమయం తర్వాత డబ్బులు ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని, దీని ద్వారా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts