information

ఎన్నికల్లో ఓటు వేసాక సెల్ఫీ దిగితే మీ ఓటు చెల్లదు. అసలు ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సెల్ఫీ లు అంటే చాలా మందికి మోజు, ఒకప్పుడు ప్రమాదాలు జరిగితే సహాయ సిబ్బందికి కాల్ చేసేవారు, ఇప్పుడు ఆ ప్రమాదాల ముందు నిలబడి సెల్ఫీ లు దిగే వారు, వీడియో లు తీసే వారి సంఖ్యా ఘననీయంగా పెరిగింది. అయితే మీరు ఎన్నికల బూత్‌లో ఓటు వేసిన వెంటనే, మీ అత్యుత్సాహం తో సెల్ఫీ దిగి, నేను ఓటు వేసాను అని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటే మీ ఓటు రద్దు చేయబడుతుంది. ఎన్నికల బూత్‌ లో ఫోన్ లు అనుమతించబడవు, ఒకవేళ మీరు ఫోన్ తీసుకొని వెళ్లి ఓటు వేసాక ఎన్నికల బూతులో సెల్ఫీ దిగితే, మీ ఓటు ని రద్దు చేస్తారు, మీరు ఓటువేస్తూ సెల్ఫీ దిగితే ఆ ఓటును 17 ఏలో నమోదు చేస్తారు. ఎప్పుడైతే ఆ ఓటును 17-ఏలో నమోదు చేశారో అది కౌంటింగ్ సమయంలో పరిగణలోకి తీసుకురాదు. దాన్ని కౌంట్ చెయ్యరు.

ఇంటికి వెళ్ళాకనో, లేదా ఎన్నికల కేంద్రం కి కొంచెం దూరం వెళ్ళాకనో మీకు నచ్చిన భంగిమలలో మీరు సెల్ఫీ లు దిగి ఎక్కడైనా అప్లోడ్ చేసుకోండి. దొంగ ఓటు వేసిన వాళ్ళకి 6-7 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది, కనుక దొంగ ఓట్లు వెయ్యకండి. ఎన్నికల కేంద్రం లో మీరు ఓటు ఎవరికి వేస్తున్నారో, లేక వేరే వాళ్ళని వీరికి ఓటు వేయండి అని చెప్పినచో మీ ఓటు చెల్లదు, అది నేరం కిందకు వస్తుంది.

your vote will be invalid if you do like this

కనుక, వెళ్ళామా… ఓటు వేశామా.. అన్నట్టు ఉండాలి. బయటికి వచ్చాక మీ ఇష్టం.

Admin

Recent Posts