lifestyle

సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉన్న‌వారు అదృష్ట‌వంతులా ? వారికి ఎల్ల‌ప్పుడూ ల‌క్ క‌ల‌సి వ‌స్తుందా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా సొట్ట బుగ్గల‌ను క‌లిగిన వారు చాలా త‌క్కువ మందే ఉంటారు. ఒక స‌ర్వే ప్రకారం ప్ర‌పంచంలో సుమారుగా 20 శాతం మందికి సొట్ట బుగ్గ‌లు ఉంటాయ‌ని తేలింది. సొట్ట బుగ్గ‌లు ఎందుకు ఏర్ప‌డుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ జ‌న్యు సంబంధ కార‌ణాల వ‌ల్ల ఏర్ప‌డుతాయ‌ని కొంద‌రు సైంటిస్టులు చెబుతున్నారు.

సొట్ట బుగ్గ‌లు పుట్టుక‌తోనే వ‌స్తాయి. వాటిని ఆప‌రేష‌న్ చేసి సృష్టించ‌లేము. గ‌తంలో కొంద‌రు ఇందుకు ప్ర‌య‌త్నించారు. కానీ విజ‌య‌వంతం కాలేక‌పోయారు. అయితే సొట్ట బుగ్గ‌ల‌పై సైన్స్ ఇంత‌కు మించి ఏమీ చెప్ప‌లేదు. కానీ న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉండేవారు అదృష్ట‌వంతుల‌ని చెబుతారు. వారికి ల‌క్ ఎప్పుడూ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. ఏ కెరీర్‌ను వారు ఎంచుకున్నా వారు ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటార‌ట‌.

is it lucky to have dimples

సొట్ట బుగ్గ‌లు క‌లిగిన ప‌లువురు సెల‌బ్రిటీలు ఎంత‌టి పేరు ప్ర‌ఖ్యాతుల‌ను గాంచారో అంద‌రికీ తెలిసిందే. అందువ‌ల్ల సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉన్న‌వారికి ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని చెబుతారు. సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉండేవారు చూసేందుకు స‌హ‌జంగానే ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తారు. వారు న‌వ్వితే చూసేందుకు ఇంకా ముచ్చటేస్తుంది.

సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉన్న‌వారిని గ్రీకు భాష‌లో గెలాసిన్ అని పిలుస్తారు. గ్రీకు భాష‌లో గెలాసిన్ అంటే న‌వ్వ‌డం అని అర్థం. న‌వ్విన‌ప్పుడు కొంద‌రికి సొట్ట బుగ్గ‌లు వ‌స్తాయి. కొంద‌రికి న‌వ్వ‌కున్నా సొట్ట బుగ్గ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. అయితే న్యూమరాల‌జీ మాత్రం సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉండేవారు ఎంతో అదృష్ట‌వంతుల‌ని చెబుతోంది. వారికి ఎల్ల‌ప్పుడూ ల‌క్ ఉంటుంద‌ట‌. ఏ ప‌ని చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. అందుక‌ని సొట్ట బుగ్గ‌లు క‌లిగి ఉన్న‌వారు ల‌క్కీ అని చెబుతుంటారు.

Share
Admin

Recent Posts