lifestyle

పురుషుడి చూపును బట్టి స్త్రీ ఏం గమనిస్తుందో తెలుసా..?

ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా మొదటి చూపుతోనే మొదలవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటూ ఉంటారు. అంటే దాని అర్థం మొదటి చూపులోనే ప్రేమలో పడటం. ఒక మనిషిని చూసినప్పుడు ఎవరైనా వారి కళ్ళనే చూస్తారు. అవతల వారి చూపును బట్టి వాళ్ళు భయపడుతున్నారా? ధైర్యంగా ఉన్నారా? ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అనేది పసిగడతారు. అయితే పురుషుడి చూపును బట్టి స్త్రీ ఏం గమనిస్తుందో తెలుసా, ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రం లోతైన చాలా ఈజీగా తెలుసుకోవచ్చు గానీ, ఆడవారి మనసు తెలుసుకోవడం చాలా కష్టమనే నానుడి మీరు వినే ఉంటారు. ఈ నానుడిని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే అంశం దాని గురించే. అయితే, చాలామంది పురుషులు తమకు నచ్చిన స్త్రీల ప్రేమను పొందేందుకు ఎంతగానో ఆరాటపడుతుంటారు. ఆ స్త్రీ అతడిని ప్రేమించాలని లేదా ఆమెకు దగ్గర అవ్వాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.

what women thinks upon looking at men

ఈ క్రమంలో కొంతమంది సక్సెస్ అవుతుంటారు. ఇంకొంతమంది విఫలమవుతుంటారు. అయితే రిజెక్ట్ అయిన వారు మాత్రం ఆమె తనని ఎందుకు రిజెక్ట్ చేసిందో అర్థం కాక ఆగమాగం అవుతుంటారు. అయితే ప్రముఖులు చెప్పిన ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుడిని ఇష్టపడాలంటే చాలా ఆలోచిస్తుందట. ఇందుకోసం తన ఆలోచనలకు పదును పెడుతుందట. పురుషుడు తన నుంచి ఏం ఆశిస్తున్నాడో అనేది అతడి చూపులను బట్టి గమనిస్తుందట. అంతేకాకుండా అతడు బాధ్యతగలవాడా కాదా అనేది కూడా స్త్రీ ముందే పసిగడుతుందట. ఇలా అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతనే అతడి ప్రేమను అంగీకరిస్తుందట.

Admin