వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డ‌యాబెటిస్ కావ‌చ్చు..

డయాబెటిస్ అనేది క్లిష్టమైన సమస్య. దీని లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. వారసత్వంగా కూడా వచ్చే డయాబెటిస్, అనేక అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. అందుకే దీనిపట్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఉత్పత్తి అయిన చ‌క్కెర‌ రక్తంలో పేరుకుపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇలా చక్కెర స్థాయి రక్తంలో పెరుగుతుండడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక అవి ఒక చోట ఆగిపోతాయి. దీనివల్లనే కాళ్ళు, చేతులు ఉబ్బుగా కనిపిస్తాయి. డయాబెటిస్ వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. మీకు తరచుగా ఈ సమస్య ఉన్నట్లయితే డాక్టరును సంప్రదించడం మంచిది. రక్తంలో చక్కెర అధికమవడం వలన అవి విష పదార్థాలను బయటకి తీయలేవు. దానివల్ల మూత్రంలో రక్తస్రావం, చేతులు మరియు కాళ్ళలో వాపు, చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి అనుభూతి, వికారం, శ్వాస సంబంధమైన సమస్యలు కలుగుతాయి.

అయితే, ఈ లక్షణాలు ఇతర వ్యాధుల వల్ల కూడా సంభవిస్తాయి, కాబట్టి మీ వైద్యుడితో మాట్లాడి మీ రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోండి. డయాబెటిస్ కారణంగా వచ్చే ఇతర సమస్యలేంటో చూద్దాం. స్థూలకాయం, రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం, గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు. వ‌స్తాయి. డయాబెటిస్ టైప్2 లక్షణాలు.. భూమి తిరుగుతున్నట్టు అనిపించడం, దాహం వేయడం, అతిగా మూత్రవిసర్జన కలగడం, ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించడం, బరువు తగ్గి సన్నగా మారడం లేదా బరువు పెరిగి లావుగా తయారవడం, గాయాలు తొందరగా నయం కాకపోవడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

if you have these symptoms then it might be diabetes

మీకిలాంటి లక్షణాలు కనిపించినట్లైతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కాళ్ళు, చేతులు ఉబ్బడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. ప్రతీదీ డయాబెటిస్ అనుకోవడానికి వీల్లేదు. మీ వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యం పట్ల ఒక నిర్ణయానికి రావాలి.

Admin

Recent Posts