వైద్య విజ్ఞానం

అతిగా శుభ్రంగా ఉండ‌డం కూడా ప్ర‌మాద‌క‌ర‌మేనా..? నిపుణులు ఏమంటున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రజెంట్ జనరేషన్ అతి శుభ్రతను&lpar;Over Hygiene&rpar; పాటిస్తోందనీ&comma; దీనివలన అనారోగ్యం బారిన పడతారనే వాదన నిజం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు&period; చిన్నతనంలోనే కొన్ని రకాల సూక్ష్మ జీవుల ప్రభావం పడితే ఇమ్యూనిటీ పెరుగుతుందని&comma; ఫలితంగా ఎలర్జిక్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాస్త్రంలో ఒక సూత్రం ఉంది&period; 21వ శతాబ్దంలో సమాజం అతి శుభ్రంగా ఉంటోందని&comma; దీనివల్ల చిన్నారులు కొన్ని రకాల సూక్ష్మ జీవులకు దూరంగా ఉంటున్నారన్న భావన ఉంది&period; అందువల్ల ఎలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటోందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు&period; తాజాగా యూనివర్శిటీ కాలేజి లండన్&comma; లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ఈ వాదనను కొట్టిపారేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగ నిరోధక&comma; జీవక్రియ వ్యవస్థలు తగిన విధంగా సిద్ధం కావడానికి కొన్ని రకాల సూక్ష్మజీవుల అవసరమేనని వారు అంగీకరించారు&period; మన పేగులు&comma; చర్మం&comma; శ్వాస నాళాల్లో ఉండే సూక్ష్మ జీవులు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి&period; చాలావరకూ అవి తల్లి&comma; ఇతర కుటుంబ సభ్యులు&comma; సహజ సిద్ధ వాతావరణం నుంచి వస్తాయి&period; అయితే గత 20 ఏళ్లలో పరిశుభ్రత విధానాలతో వాటికి దూరం అవుతున్నట్లు ఒక వాదన ఉంది&period; అది పూర్తిగా నిజం కాదని పరిశోధకులు పేర్కొంటున్నారు&period; ఈ దిశగా నాలుగు అంశాలను ప్రస్తావించారు&period; ఆధునిక ఇళ్లలో ఉండే సూక్ష్మ జీవులు చాలావరకూ మన రోగ నిరోధక శక్తికి అవసరం లేనివే&period; మనం తీసుకునే టీకాలు&comma; ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతోపాటు మన రోగ నిరోధక శక్తి&lpar;&lpar;Immunity&rpar;&rpar;ని బలోపేతం చేస్తాయి&period; అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ సిద్ధం కావడం కోసం వ్యాధి కారక సూక్ష్మ జీవుల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87796 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;over-hygeine&period;jpg" alt&equals;"is over hygeine good for health or what " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సహజ సిద్ధ హరిత వాతావరణంలోని సూక్ష్మ జీవులు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం&period; ఇళ్లలోని శుభ్రత&lpar;Hygiene&rpar;&comma; ఆరోగ్యం వంటివి అలాంటి సహజ సిద్ధ వాతావరణాన్ని మన నుంచి దూరం చేయలేవు&period; అతి శుభ్రత&comma; ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధాన్ని నిపుణులు పలు సందర్భాల్లో గుర్తించిన మాట వాస్తవమే&period; అయితే అవి చాలావరకూ సూక్ష్మ జీవుల లేమి వల్ల ఉత్పన్నమైనవి కావు&period; శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లే ఇలా జరుగుతోంది&period; అందువల్ల ఇళ్ల శుభ్రత&comma; వ్యక్తిగత శుభ్రత మంచిదేనని పరిశోధకులు వివరిస్తున్నారు&period; అయితే పరిశుభ్రతకు సంబంధించిన రసాయనాలకు చిన్నారులు నేరుగా గురికాకుండా చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts