Digestive System : ఆరోగ్యకరమైన అలవాట్లని మనం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కొన్ని అలవాట్ల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా మనకే నష్టం. ఉదయం పూట మలవిసర్జనకు ముందు నీళ్లు తాగకపోవడం పొరపాటు. చాలా మంది ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. ఉదయం లేచి రెండు గ్లాసుల చల్లని నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ తాగితే సులువుగా మలం పోతుంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగండి.
ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బాత్ రూమ్ కి వెళ్లడానికి సరైన సమయం. శరీరంలో గాలి ఎక్కువగా ఈ సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఇది సరిగ్గా మలం రావడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బాత్ రూమ్ కి వెళ్లడం మంచిది. చాలా మంది ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి టాయిలెట్లలోకి కూడా మొబైల్ ఫోన్స్ ని తీసుకు వెళుతున్నారు.
కానీ అది తప్పు. న్యూస్ పేపర్ ని తీసుకు వెళ్ళడం, పుస్తకాలను తీసుకు వెళ్లడం లేదంటే మొబైల్ ఫోన్ ని తీసుకెళ్లడం వలన సమయం తెలియకుండా, బలవంతంగా ఎక్కువ సేపు కూర్చుంటూ ఉంటారు. ఇది నిజానికి హానికరం. ఈ తప్పును చేయకండి. కొంతమంది భోజనం చేసిన వెంటనే బాత్రూంకి వెళ్తుంటారు.
లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతుంటారు. అది తప్పు. అలాంటి వాళ్ళ యొక్క శరీరం సన్నగా ఉంటుంది. సులభంగా అలసిపోతారు. తక్కువ శక్తిని కలిగి ఉంటారు. ఈ రకమైన సమస్య ఉన్న వాళ్ళు కారం, మసాలా ఆహారాలని తినకూడదు. కడుపుని శుభ్రపరిచే ఔషధాన్ని రాత్రిపూట తీసుకోవద్దు. చాలా మంది రాత్రి పొట్టను శుభ్రం చేసుకోవడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. పొట్ట క్లీన్ చేయడం వలన పేగులు బలహీన పడిపోతాయి.