Allam Pachi Mirchi Chutney : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద చేసే అల్లం ప‌చ్చి మిర్చి చ‌ట్నీ.. త‌యారీ ఇలా..!

Allam Pachi Mirchi Chutney : మ‌న‌కు ఉద‌యం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద అనేక ర‌కాల అల్పాహారాలు ల‌భిస్తాయి. అలాగే వీటిని తిన‌డానికి వివిధ రకాల చ‌ట్నీల‌ను కూడా ఇస్తూ ఉంటారు. బండ్ల మీద ఎక్కువ‌గా స‌ర్వ్ చేసే చ‌ట్నీలల్లో అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీ కూడా ఒక‌టి. ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దోశ‌, ఇడ్లీ, వ‌డ‌, ఊత‌ప్పం, ఉప్మా ఇలా దేనితో తిన్నా కూడా ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీని మ‌నం అదే రుచితో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. 10 నిమిషాల్లోనే చాలా సుల‌భంగా ఈ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. బండ్ల మీద ల‌భించే అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నూనె – అర టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, అల్లం ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2 లేదా 3, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, పుట్నాల ప‌ప్పు – పావు క‌ప్పు, బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూన్, చింత‌పండు – చిన్న ఉసిరికాయంత‌.

Allam Pachi Mirchi Chutney recipe in telugu
Allam Pachi Mirchi Chutney

అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత అల్లం ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి త‌రువాత ఈ చ‌ట్నీని గిన్నెలోకి తీసుకుని తాళింపు వేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీ త‌యార‌వుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే ప‌ల్లీ చ‌ట్నీ కంటే ఈ విధంగా త‌యారు చేసిన అల్లం చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts