Spicy Gongura Kura : గోంగూర కూర‌ను ఇలా కారంగా చేసి తినండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Gongura Kura : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూర‌లల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గోంగూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌రుచూగా ప‌ప్పు, ప‌చ్చ‌డి మాత్రమే కాకుండా గోంగూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్కసారి ఈ క‌ర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. గోంగూర‌తో రుచిగా, క‌మ్మ‌గా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన పెద్ద ట‌మాట – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గోంగూర – రెండు పెద్ద‌వి, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు.

Spicy Gongura Kura recipe very tasty with rice
Spicy Gongura Kura

గోంగూర క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత గోంగూర వేసి క‌ల‌పాలి. దీనిపైమూత పెట్టి గోంగూర మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. గోంగూర ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత జీల‌కర్ర పొడి, ధ‌నియాల పొడి, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌ప్పుగుత్తితో గోంగూర‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర‌తో త‌యారు చేసిన ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts