Beerakaya Chutney : బీరకాయ పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..

Beerakaya Chutney : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. బీరకాయలను వేసవిలో తింటే చేదు తగులుతుంది. కనుక వేసవిలో వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే మిగిలిన సీజన్లలో బీరకాయలను ఎక్కువగా తింటుంటారు. వీటిని నేరుగా అలాగే వండుకుని తినవచ్చు. లేదా ఇతర కూరగాయలతో కలిపి వండవచ్చు. అయితే బీరకాయలను ఎలా వండినా సరే రుచిగానే ఉంటాయి. బీరకాయలతో పచ్చడి చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది. ఈ క్రమంలోనే బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

బీరకాయ ముక్కలు – మూడు కప్పులు (చిన్నగా తరగాలి), టమాటా – ఒకటి (పెద్దది), పచ్చి మిరపకాయలు – పది, ఆవాలు – అర టీస్పూన్‌, శనగపప్పు – అర టీస్పూన్‌, పెసర పప్పు – అర టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, వెల్లుల్లి – నాలుగు రెబ్బలు, ఉప్పు – తగినంత, పసుపు – తగినంత, నూనె – ఒక టేబుల్‌ స్పూన్‌.

Beerakaya Chutney recipe in telugu make in this method
Beerakaya Chutney

బీరకాయ పచ్చడిని తయారు చేసే విధానం..

పాన్‌లో నూనె వేసి బీరకాయ ముక్కలు, పసుపు వేయాలి. పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి వేసి మెత్తబడే వరకు కలియబెట్టాలి. ఆ తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేయాలి. మెత్తగా అయ్యాక స్టవ్‌ ఆఫ్‌ చేసి దించాలి. ఈ మిశ్రమాన్ని జార్‌లో వేసుకోవాలి. ఆ తరువాత పాన్‌లో నూనె వేసి పోపు దినుసులు, శనగ పప్పు, పెసర పప్పు వేసి ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా వచ్చేట్లు చట్నీలా పట్టాలి. ఈ చట్నీని అన్నం లేదా చపాతీతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts