Carrot Malpua : క్యారెట్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన స్వీట్‌.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Carrot Malpua : మ‌న‌కు స్వీట్ షాపుల‌ల్లో ల‌భించే వెరైటీల‌లో మాల్పువా కూడా ఒక‌టి. మాల్పువా చాలా మెత్త‌గా, రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మాల్పువాను మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటారు. మైదాపిండి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. క‌నుక మైదాపిండికి బ‌దులుగా మ‌నం గోధుమ‌పిండితో కూడా మాల్పువాను త‌యారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో క్యారెట్ వేసి మ‌రింత ఆరోగ్య‌క‌రంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా క్యారెట్ మాల్పువాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ మాల్పువా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యారెట్ ముక్క‌లు – ఒక క‌ప్పు, యాల‌కులు – 3, పంచ‌దార – ఒక టేబుల్ స్పూన్, పాలు – పావు క‌ప్పు, గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – పావు క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, వంట‌సోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Carrot Malpua recipe make in this method
Carrot Malpua

క్యారెట్ మాల్పువా త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో క్యారెట్ ముక్క‌లు, యాల‌కులు, పంచ‌దార వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పాలు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత గోధుమ‌పిండి, ర‌వ్వ వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మం ఉండ‌లు లేకుండా ఉండ‌డానికి మరోక‌ప్పు పాలు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత పంచ‌దార పాకానికి గానూ ఒక గిన్నెలో ఒక‌టిన్న‌ర క‌ప్పులు పంచ‌దార‌, ఒక‌టిన్న‌ర క‌ప్పులు నీళ్లు పోసి స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత దీనిని మ‌రో 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత యాల‌కుల పొడి, ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న పిండిలో వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఒక గంటె నిండుగా పిండిని తీసుకుని నూనెలో వేసుకోవాలి. పిండి వేసుకున్న త‌రువాత గంటెతో క‌దిలించ‌కూడ‌దు. త‌రువాత దీనిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత దీనిని నూనె నుండి తీసి ముందుగా సిద్దం చేసుకున్న పంచ‌దార‌పాకంలో వేసుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు పాకంలో ఉంచి బ‌య‌ట‌కు తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ మాల్పువా త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు. ఈ విధంగా త‌యారు చేసిన క్యారెట్ మాల్పువాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts