Street Style Samosa : బండి మీద చేసే స‌మోసాల‌ను ఇంట్లోనే ఇలా ఎంతో టేస్టీగా చేసుకోవ‌చ్చు..!

Street Style Samosa : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఆలూ స‌మోసాలు కూడా ఒక‌టి. ఆలూ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఆలూ స‌మోసాల‌ను మ‌నం కూడా ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌మోసాలు చుట్ట‌డం రాని వారు కూడా కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా తేలిక‌గా స‌మోసాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని చాలా తేలిక‌గా, చాలా త‌క్కువ స‌మ‌యంలో, ఎక్కువ శ్ర‌మ లేకుండా త‌యారు చేసుకోవ‌చ్చు. బండ్ల మీద రుచితో ఇంట్లోనే తేలిక‌గా స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్ట‌ఫింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – 2 టీ స్పూన్స్.

Street Style Samosa recipe in telugu very easy to make and tasty
Street Style Samosa

పిండి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – 2 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, వాము – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, నీళ్లు – త‌గిన‌న్ని.

ఆలూ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, వాము, క‌రిగించిన నెయ్యి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు స్ట‌ఫింగ్ కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం ధ‌నియాల పొడి, ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంపను మెత్త‌గా చేసి వేసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యంపిండి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. బంగాళాదుంప‌లో ఉండే నీరంతా పోయే వ‌ర‌కు వేయించి కోత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా మైదాపిండిని తీసుకుని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి.

ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకుని చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత మ‌రో భాగం పిండిని కూడా చ‌పాతీలా వ‌త్తుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ముందుగా వ‌త్తుకున్న చ‌పాతీని తీసుకుని దానిపై త్రిభుజాకారంలో మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో చిన్న గాట్లు పెట్టుకోవాలి. త‌రువాత స‌మోసా ఆకారంలో గాట్లు పెట్టుకున్న చోట ఆలూ స్ట‌ఫింగ్ ను ఉంచాలి. త‌రువాత చుట్టూ అంచుల‌ వెంబ‌డి అలాగే గాట్లు పెట్టుకున్న చోట మైదాపిండి పేస్ట్ ను రాసుకోవాలి. ఇప్పుడు వీటిపై మ‌రో చ‌పాతీని ఉంచి ముందుగా స‌మోసా ఆకారంలో చ‌పాతీని స‌ర్దుకోవాలి. త‌రువాత క‌త్తితో స‌మోసా ఆకారంలో క‌ట్ చేసుకుని అంచుల‌ను గ‌ట్టిగా వ‌త్తుతూ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌య‌రు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక స‌మోసాల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ స‌మోసాలు త‌యార‌వుతాయి. వీటిని వేడి వేడిగా ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల స‌మోసాలు రాని వారు కూడా సుల‌భంగా స‌మోసాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.

D

Recent Posts