Cauliflower Soup : ద‌గ్గు, జ‌లుబు, త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కూ ఒకే ఒక్క సూప్‌.. త‌యారీ ఇలా..!

Cauliflower Soup : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మందిని శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా, త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు చాలా మందికి వ‌స్తుంటాయి. దీంతో ఒక ప‌ట్టాన ఏమీ తోచ‌దు. ఏ ప‌నీ చేయాల‌నిపించ‌దు. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఇబ్బందులు పెడుతుంటాయి. దీంతో వీటి నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలా అని ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుసరిస్తుంటారు. అయితే కేవ‌లం ఒకే ఒక్క సూప్‌తో ఈ స‌మ‌స్య‌లన్నింటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక ఆ సూప్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలిఫ్ల‌వ‌ర్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాలిఫ్ల‌వ‌ర్ – 2 లేదా 3 మీడియం సైజ్ పీస్‌లు (త‌ర‌గాలి), ఉల్లిపాయ‌లు – 2 మీడియం సైజ్‌వి, అల్లం – ఒక టీస్పూన్ (స‌న్న‌గా త‌ర‌గాలి), మిరియాలు – 2 టీస్పూన్లు (పొడి చేయాలి), యాల‌కులు – 2, పిప్ప‌ళ్లు – 2 ముక్క‌లు, ఉప్పు – రుచికి స‌రిప‌డా.

Cauliflower Soup recipe in telugu best for cough and cold
Cauliflower Soup

కాలిఫ్ల‌వ‌ర్ సూప్‌ను త‌యారు చేసే విధానం..

ఒక పాత్ర‌లో త‌గినంత నీళ్ల‌ను పోసి అందులో పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను ఒక దాని త‌రువాత ఒకటి వేస్తూ స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా మ‌రిగాక స్ట‌వ్‌ను ఆఫ్ చేయాలి. దీంతో కాలిఫ్ల‌వ‌ర్ సూప్ రెడీ అవుతుంది. దీన్ని రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం తాగ‌వ‌చ్చు. ఇలా తాగ‌డం వ‌ల్ల అన్ని శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Editor

Recent Posts