Drumstick Masala Curry : అన్నం, చ‌పాతీల్లోకి అదిరిపోయే మున‌క్కాయ మ‌సాలా కూర‌..!

Drumstick Masala Curry : మున‌క్కాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌నంద‌రికీ తెలుసు. ఈ మున‌క్కాయ‌ల‌ను మ‌నం ఆహారంగా కూడా తీసుకుంటాం. చాలా మంది మున‌క్కాయల‌ను ఇష్టంగా తింటారు. సాంబార్ లో మున‌క్కాయ‌లు వేసి చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. మున‌క్కాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా క్యాట‌రింగ్ స్టైల్ లో మున‌క్కాయ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాయ‌ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన మునక్కాయ‌లు – 2, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన ఉల్లిపాయ – 1(పెద్ద‌ది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ట‌మాట – 1 (పెద్ద‌ది), ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – త‌గినంత‌, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – 150 ఎమ్ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Drumstick Masala Curry very good for rice or chapati
Drumstick Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, దాల్చిన చెక్క ముక్క – 1, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, చింత‌పండు – కొద్దిగా.

మున‌క్కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో చింతపండు త‌ప్ప మిగిలిన మ‌సాలా దినుసుల‌న్నింటిని ఒక‌దాని త‌రువాత ఒక‌టి వేసి వేయించుకోవాలి. ఈ దినుసుల‌న్నీ చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింత‌పండును కూడా వేసి ముందు పొడిలా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిని తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ మిశ్ర‌మం వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాటల‌ను గుజ్జుగా చేసి వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మున‌క్కాయ ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ ను వేసి క‌లపాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీటిని పోసి క‌ల‌పాలి. మున‌క్కాయ ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు మూత పెట్టి ఉడికించాలి. మున‌క్కాయ ముక్క‌లు ఉడికిన త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండేమున‌క్కాయ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. ఈ కూర‌ను అన్నం, చ‌పాతీ, పులావ్, రోటి, పుల్కా, బిర్యానీ ఇలా దేనితోనైనా క‌లిపి తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేసిన మున‌క్కాయ మ‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts