Etthara Jenda Video Song : ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్త‌ర జెండా వీడియో సాంగ్‌.. అద్భుతంగా ఉంది..!

Etthara Jenda Video Song : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ తేజ, ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందులో భాగంగానే సోమ‌వారం నుంచి చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది.

Etthara Jenda Video Song launched from RRR movie
Etthara Jenda Video Song

కాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా అనే వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ పాట ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇందులో ఆలియా భ‌ట్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌లు న‌టించారు. ఎంతో క‌ల‌ర్‌ఫుల్‌గా ఈ సాంగ్‌ను తెర‌కెక్కించారు. దీంతో ఈ పాట సంగీత ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌రణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టించ‌గా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించారు. బాలీవుడ్ ని ఆలియా భ‌ట్ సీత అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. హాలీవుడ్ న‌టి ఒలివియా మోరిస్ మ‌రో కీల‌క‌పాతలో న‌టించ‌గా.. బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ.. త‌దిత‌రులు కూడా ఈ సినిమాలో న‌టించారు.

Editor

Recent Posts