How To Remove Bad Smell From Fridge : మీ ఫ్రిజ్ నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను 5 నిమిషాల్లో పోగొట్టే అద్భుత‌మైన చిట్కా..!

How To Remove Bad Smell From Fridge : ఈమ‌ధ్య కాలంలో దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. సుల‌భ‌మైన వాయిదాల ప‌ద్ధ‌తుల‌ను షోరూంలు అందిస్తుండ‌డంతో అంద‌రూ ఈఎంఐలు పెట్టి అయినా స‌రే ఫ్రిజ్ లాంటి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్రిజ్ ఇంట్లో ఉంటే దాంతో ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. ఆహారాల‌ను నిల్వ చేసేందుకు ఫ్రిజ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో మ‌నం ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ త‌యారు చేసుకోవ‌చ్చు. నీళ్ల‌ను చ‌ల్ల‌గా చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇలా ఫ్రిజ్ వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు ఉంటాయి. అందుక‌నే చాలా మంది చిన్న‌దైనా స‌రే ఒక ఫ్రిజ్‌ను మాత్రం క‌చ్చితంగా కొంటుంటారు.

అయితే మ‌నం ఫ్రిజ్‌లో ర‌క ర‌కాల ఆహారాల‌ను నిల్వ చేస్తుంటాం. వీటి వ‌ల్ల ఫ్రిజ్ నుంచి అప్పుడడ‌ప్పుడు దుర్వాస‌న వ‌స్తుంటుంది. ఫ్రిజ్‌ను ఎంత క్లీన్ చేసినా కూడా ఆ వాస‌న అలాగే ఉంటుంది. దీంతో ఫ్రిజ్‌ను తెరిచిన‌ప్పుడ‌ల్లా ఆ వాస‌న‌తో ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మీ ఫ్రిజ్ కూడా ఇలాగే వాస‌న వ‌స్తుందా. కానీ దానికి మీరు విచారించాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ అద్భుత‌మైన చిట్కాను పాటిస్తే చాలు. మీ ఫ్రిజ్ లోని స్మెల్ ఇట్టే తొల‌గిపోతుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

How To Remove Bad Smell From Fridge follow this simple natural tip
How To Remove Bad Smell From Fridge

ముందుగా కార‌ణం గుర్తించాలి..

ఫ్రిజ్ నుంచి వాస‌న వ‌స్తుంటే ఏ కార‌ణం చేత వాస‌న వ‌స్తుందో ముందుగా గుర్తించాలి. సాధార‌ణంగా ఫ్రిజ్‌లో మ‌నం పెట్టే ప‌దార్థాలు లేదా ద్ర‌వాల వ‌ల్లే వాస‌న వ‌స్తుంది. క‌నుక అదేమిటో ముందుగా గుర్తించాలి. ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే స‌హ‌జంగానే ఫ్రిజ్ నుంచి వాస‌న వ‌స్తుంది. అలాగే ఆయా ప‌దార్థాల‌కు చెందిన మ‌ర‌క‌లు ప‌డినా కూడా ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. క‌నుక వాస‌న‌కు అస‌లు కార‌ణం ఏమిటో ముందుగా గుర్తించాలి. అప్పుడే మ‌నం ఫ్రిజ్ నుంచి వెలువ‌డే దుర్వాస‌న‌ను పూర్తిగా తొల‌గించ‌గ‌లుగుతాము.

ఇక ఫ్రిజ్‌లో ముందుగా వాస‌న వ‌చ్చే ప‌దార్థాల‌ను తీసి బ‌య‌ట ప‌డేయాలి. అవి పాడైతేనే బ‌య‌ట ప‌డేయాలి. లేదంటే బ‌య‌ట పెట్టుకోవాలి. త‌రువాత ఫ్రిజ్ మొత్తాన్ని ఖాళీ చేసి బాగా క్లీన్ చేయాలి. అనంత‌రం ఒక నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను తీసుకుని తురుం ప‌ట్టాలి. ఒక ప్లేట్‌లో ఆ తురుము వేయాలి. దానిపై ఉప్పు, బేకింగ్ సోడా చ‌ల్లాలి. ఇది డియోడ‌రైజ‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఇక ఈ ప్లేట్‌ను ఫ్రిజ్‌లో ఏదైనా ఒక చోట పెట్టాలి. దీంతో ఫ్రిజ్‌లోని వాస‌న మొత్తం పోతుంది. అదేవిధంగా మీరు ఫ్రిజ్ నుంచి వ‌చ్చే వాస‌న‌ను తొల‌గించేందుకు ఒక చిన్న కంటెయిన‌ర్‌లో యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను కూడా ఉంచ‌వ‌చ్చు. ఇది ఫ్రిజ్‌లోని దుర్వాస‌న‌ను శోషించుకుంటుంది. దీంతో ఫ్రిజ్ నుంచి వాస‌న రాకుండా చూసుకోవ‌చ్చు.

15 రోజుల‌కు ఒక‌సారి క్లీన్ చేయాలి..

ఇక ఫ్రిజ్‌ను తప్ప‌నిస‌రిగా 15 రోజుల‌కు ఒక‌సారి క్లీన్ చేయాలి. దీంతో వాస‌న రాకుండా చూసుకోవ‌చ్చు. ఫ్రిజ్‌ను ఎప్పుడూ పూర్తిగా నింపకూడ‌దు. కాస్త ఖాళీ ఉంచాలి. ఆహారాల‌ను గాలి చొర‌బ‌డ‌ని కంటెయిన‌ర్‌లు, పాత్ర‌లు లేదా టిష్యూ పేప‌ర్లు ఉప‌యోగించి నిల్వ చేయాలి. ఆహారాల నుంచి వాస‌న బ‌య‌ట‌కు రాకుండా చూసుకోవాలి. దీంతో ఫ్రిజ్ దుర్వాస‌న వెద‌జ‌ల్ల‌కుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ ఫ్రిజ్ ఎల్ల‌ప్పుడూ వాస‌న రాకుండా తాజాగా ఉంటుంది. దీంతోపాటు ఆహార ప‌దార్థాలు కూడా త్వ‌ర‌గా పాడ‌వ‌కుండా ఉంటాయి.

Editor

Recent Posts