OTT : ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఇక ఓటీటీల్లోనూ శుక్రవారం రోజు కొన్ని కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేస్తుంటారు. అలాగే థియేటర్లలో వచ్చి పోయిన సినిమాలను స్ట్రీమ్ చేస్తుంటారు. అయితే ఈ శుక్రవారం మాత్రం ప్రేక్షకులను అబ్బురపరిచే కొత్త మూవీలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఆ మూవీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. రౌడీ బాయ్స్. ఇది కూడా ఈ రోజే స్ట్రీమ్ కానుంది. జీ5 యాప్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు.
ఇక జీ5 యాప్‌లోనే ఈ రోజు సూపర్ శరణ్య అనే మళయాళం సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు. కామెడీ జోనర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. జీ5 యాప్‌లోనే ఈ రోజు రైడర్ అనే కన్నడ సినిమా స్ట్రీమ్ కానుంది. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఇక తమిళ స్టార్ నటుడు ధనుష్, మాళవిక మోహనన్ నటించిన మారన్ అనే సినిమా నేరుగా ఓటీటీలోనే ఈ రోజు విడుదలవుతోంది. దీన్ని హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి నటించిన క్లాప్ అనే సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే ఈ రోజు విడుదలవుతోంది. సోనీ లివ్ యాప్‌లో దీన్ని స్ట్రీమ్ చేయనున్నారు.