Left Over Rice Tomato Pulao : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఇలా చేయండి..!

Left Over Rice Tomato Pulao : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ట‌మాట పులావ్ కూడా ఒక‌టి. ట‌మాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల‌ల్లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ ట‌మాట పులావ్ ను మ‌నం మిగిలిన అన్నంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా 10 నిమిషాల్లోనే ట‌మాట పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్, ట‌మాటాలు – పెద్ద‌వి రెండు, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి -అర టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 3, అన్నం – ఒక క‌ప్పు బాస్మ‌తీబియ్యంతో వండినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Left Over Rice Tomato Pulao Recipe In Telugu very tasty
Left Over Rice Tomato Pulao

ట‌మాట పులావ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక సాజీరా, ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌లపాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండేచ ట‌మాట పులావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా రుచిగా ట‌మాట పులావ్ ను త‌యారు చేసుకుని తినవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts