Ravva Laddu : లడ్డూలలో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఎవరైనా సరే తమకు నచ్చిన లడ్డూలను కొనుగోలు చేసి లేదా తయారు చేసి తింటుంటారు. అయితే అన్ని లడ్డూలలోకి రవ్వ లడ్డూలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అయితే కాస్త కష్టపడాలే కానీ.. ఇంట్లోనే మనం ఎంతో రుచికరంగా రవ్వ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. అందుకు పెద్ద సమయం కూడా ఏమీ పట్టదు. ఇక రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూలు తయారీకి కావల్సిన పదార్థాలు..
చక్కెర – ఒక కిలో, పాలు – అర లీటర్, నెయ్యి – పావు కిలో, ఎండు కొబ్బరి – ఒక కాయ, బొంబాయి రవ్వ – ఒక కిలో, జీడిపప్పు – 50 గ్రాములు, కిస్మిస్ – 25 గ్రాములు.
రవ్వ లడ్డూలను తయారు చేసే విధానం..
కొబ్బరిని తురిమి పక్కన పెట్టాలి. యాలకులను పొడి చేయాలి. బొంబాయి రవ్వను దోరగా వేయించాలి. కొబ్బరి తురుము, చక్కెర, బొంబాయి రవ్వ కలిపి ఓ పాన్‌లో సన్నని మంటపై ఉడికించాలి. కొద్దిగా పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలియబెట్టాలి. తరువాత మిగతా పాలను పోసి దగ్గరగా వచ్చేట్లు చూడాలి. నెయ్యి కూడా వేసి బాగా కలిపి దింపాలి. చేతులకు పాలు తడిచేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు తయారవుతాయి. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి.