Vangi Bath Powder : వాంగీ బాత్ పౌడ‌ర్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Vangi Bath Powder : వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వాంగీ బాత్ కూడా ఒక‌టి. వాంగీబాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ వాంగీబాత్ లో ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన ఒక మసాలా పొడి వేస్తారు. ఈ మ‌సాలా పొడి వేస్తేనే వాంగీ బాత్ కు ఆ రుచి వ‌స్తుంది. ఈ వాంగీబాత్ పౌడ‌ర్ ను త‌యారు చేసి మ‌నం నిల్వ కూడా ఉంచుకోవ‌చ్చు. ఈ పొడి ఉంటే చాలు ఎప్పుడు కావ‌ల్సి వ‌స్తే అప్పుడు మ‌నం వాంగీ బాత్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. వాంగీ బాత్ పౌడ‌ర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వాంగీ బాత్ పౌడ‌ర్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ఎండుమిర్చి – 4, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, ల‌వంగాలు – 3, ఎండుకొబ్బ‌రి పొడి – ఒక టీ స్పూన్, గ‌స‌గ‌సాలు – అర టీ స్పూన్.

Vangi Bath Powder recipe very tasty dish to make
Vangi Bath Powder

వాంగీ బాత్ పౌడ‌ర్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఎండుమిర్చి, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ధ‌నియాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మెంతులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, ఎండుకొబ్బ‌రి వేసి వేయించాలి. వీటిని అర నిమిషం పాటు వేయించిన త‌రువాత గ‌స‌గ‌సాలు వేసి వేయించాలి. వీట‌న్నింటిని దోర‌గావేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో క‌మ్మ‌టి వాస‌న‌తో ఉండే వాంగీ బాత్ పౌడ‌ర్ త‌యార‌వుతుంది. వాంగీ బాత్ త‌యారు చేసుకున్న‌ప్పుడు ఈ పొడి వేసి తయారు చేసుకోవ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వాంగీ బాత్ త‌యార‌వుతుంది.

D

Recent Posts