Fiber Foods : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరమవుతాయి. వాటిలో ఫైబర్ కూడా ఒకటి. మన జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండాలంటే ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీర పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం బరువు తగ్గాలంటే ఫైబర్ కలిగిన పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది.
ఎంత ఎక్కువగా ఫైబర్ ను తీసుకుంటే అంత ఎక్కువగా మనం బరువు తగ్గుతాము. అలాగే ఫైబర్ ఎక్కువగా తీసుకునే వారు ఎల్లప్పుడూ బరువు తక్కువగా ఉంటారు. బరువు అదుపులో ఉన్నవారు ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మరలా బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మనం షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉంటాము. షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రోజూ మన ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తనాళాలల్లో రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలనుకునే వారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
మనం చాలా కాలం వరకు ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రంగా తయారవుతుంది. ఈ విధంగా ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కనుక మనం తప్పకుండా ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.