Kanda : మనకు మార్కెట్‌లో ఎన్నో రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ ఇష్టాలకు అనుగుణంగా కూరగాయలను తెచ్చుకుని వండి తింటుంటారు. అయితే మనకు మార్కెట్‌లో కంద కూడా కనిపిస్తుంది. చూసేందుకు ఇది అంత ఆకర్షణీయంగా ఉండదు. అందుకని దీన్ని చాలా మంది పట్టించుకోరు. దీని వైపే ఎవరూ చూడరు. నలుపు రంగులో ఉండి లోపలంతా దుంప మాదిరిగా ఉంటుంది. కనుక దీన్ని తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ దీంట్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. మనకు అవన్నీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే కందను తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కందను కొన్ని చోట్ల పులగంద అని కూడా పిలుస్తారు. ఇది మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. దీన్ని ఎప్పుడైనా సరే తినవచ్చు. ఇతర దుంపల మాదిరిగానే దీన్ని కూడా వేపుడు లేదా పులుసు, కూర చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే దీన్ని కోసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే చేతులకు దురద పెడుతుంది. అలాగే తినేటప్పుడు కూడా పెదవులకు అంటకుండా తినాల్సి ఉంటుంది. లేదంటే దురదగా అనిపిస్తుంది. ఇక కందను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
కందలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇక కందను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అలాగే క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
కందను తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే విరేచనాల సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు బరువు తగ్గడంలోనూ కంద సహాయ పడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక మార్కెట్‌లో మీకు ఇది కనిపిస్తే వదలకండి. తప్పకుండా ఇంటికి తెచ్చుకుని వండి తినండి. ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.