Corn Dosa : దోశ అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దోశల్లో అనేక రకాల దోశలు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ వేసుకుని తింటారు. అయితే మనకు బయట వివిధ రకాల దోశలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కార్న్ దోశ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా సులభమే. ఇంట్లోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే కార్న్ దోశను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్న గింజలు – 2 కప్పులు, మినప ప్పు – అర కప్పు, ఎండు మిర్చి – 3, జీలకర్ర – 1 టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, ఉల్లిపాయ – 1, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
కార్న్ దోశను తయారు చేసే విధానం..
ముందుగా మొక్కజొన్న గింజలను నానబెట్టాలి. మినప పప్పును ఓ గంట ముందుగా నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి మొక్కజొన్నలను గ్రైండ్ చేయాలి. మెత్తగా రుబ్బాలి. కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఈ మిశ్రమంలో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి మరోసారి గ్రైండ్ చేయాలి. అలాగే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టిన తరువాత కొన్ని ఉల్లిపాయలు, ముందుగా నానబెట్టిన మినప పప్పును కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పనులన్నీ రాత్రే చేసుకోవాలి. ఉదయం టిఫిన్ కోసం కార్న్ దోశ చేయాలనుకునేవాళ్లు.. రాత్రి పూటే దాన్ని మిశ్రమాలుగా చేసి పెట్టుకోవాలి. ఉదయం కల్లా పిండి బాగా పులుస్తుంది కాబట్టి దోశలు బాగా వస్తాయి. అందుకే రాత్రే చేసుకోవడం బెటర్. రెండు మిశ్రమాలను కలిపి ఒకే మిశ్రమం చేసి పక్కన పెట్టుకోవాలి. ఉదయం లేవగానే దోశ పాన్ పెట్టుకొని మామూలుగా దోశలు వేసినట్టుగా వేసుకొని.. చట్నీ, సాంబారుతో కలిపి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఈసారి ఇలా కార్న్ దోశలను ట్రై చేయండి. బాగుంటాయి.