Off Beat

ఇంటర్వ్యూ కి వచ్చిన వారిని…ఈ 20 ప్రశ్నలు అడిగి భయపెడుతుందట “గూగుల్”..!

గూగుల్‌.. ఈ సంస్థ పేరు తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎందుకంటే.. నేటి త‌రుణంలో అనేక మంది వాడుతున్న ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది గూగుల్ సంస్థే. అంతేకాదు, కంప్యూట‌ర్ల‌లో వాడే జీమెయిల్‌, క్రోమ్ బ్రౌజ‌ర్‌, గూగుల్ సెర్చ్‌.. వంటివ‌న్నీ గూగుల్ సంస్థ‌కు చెందిన సేవలే. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ మ‌న‌కు అందించే సేవ‌లు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ స‌ర్వీస్‌ల‌ను అందించాలంటే వాటిని డెవ‌ల‌ప్ చేసేందుకు మంచి నైపుణ్యం ఉన్న సాఫ్ట్‌వేర్ టీం ఉండాలి క‌దా. మ‌రి అలాంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను ఎంపిక చేయ‌డానికి గూగుల్ అభ్య‌ర్థుల‌కు ఎంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌ను ఇంట‌ర్వ్యూల‌లో సంధిస్తుందో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట‌ర్వ్యూల‌లో గూగుల్ సంస్థ అడిగే 20 క‌ఠిన‌త‌ర‌మైన ప్ర‌శ్న‌లు ఇవే..! 1. www.google.com వెబ్‌సైట్‌లోకి వెళ్లిన‌ప్పుడు ఏం జ‌రుగుతుంది ? సాంకేతిక ప‌రంగా వివ‌ర‌ణ ఇవ్వండి. 2. మీకు మూడు వేల అకౌంట్లు ఉన్నాయి, మూడు వారాల్లో వాటిని సార్టింగ్ చేయాలి, ఏం డాటాను మీరు కలెక్ట్ చేస్తారు ? మీ కస్టమర్ ను to up sell across the verticals అనే విషయంలో ఏ విధంగా ఒప్పిస్తారు ? 3. మీకు బాగా న‌చ్చిన ఫేవ‌రెట్ గూగుల్ ప్రోడ‌క్ట్ ఏది ? దాన్ని మీరు అయితే ఎలా ఇంప్రూవ్ చేస్తారు ? 4. ఒక కాయిన్‌ని వెయ్యిసార్లు ఫ్లిప్ చేస్తే, హెడ్స్ 560 సార్లు వచ్చాయి, కాయిన్‌ బయాస్డ్‌గా ఉందంటారా ? 5. ఒక విమానంలో ఎన్ని టెన్నిస్ బాల్స్ పడతాయో ఎలా అంచనా వేస్తారు ? 6. Third Graderకి డాటాబేస్‌ని ఎలా వివరిస్తారు ?

20 difficult questions asked in google interviews

7. మా ప్రాసెసర్ చాలా పవర్‌ని కన్స్యూమ్ చేస్తోంది, దాన్ని తగ్గించడానికి ఎటువంటి ప్రోగ్రామ్‌ని రూపొందిస్తారు ? 8. మీరు ఒకే ఒక sentence ని గుర్తుంచుకుంటారనుకుందాం, అదేమై ఉండాలి ? 9. అత్యంత సవాల్‌గా ఉండే bug ఏది ? మీరు ఏం నేర్చుకున్నారు ? 10. ఒక జోక్ చెప్పండి ! 11. ఒక ఎంట్రీ పాయింట్ ఆధారంగా ఒక given mageలో ఒక బాల్ ఎక్కడ ఎగ్జిట్ తీసుకుంటుందో ముందుగా ఊహించగల algorithmను డిజైన్ చేయండి. 12. మీకు ఇప్పుడు 10 మిలియన్ డాలర్లు ఇస్తే మీరేం చేస్తారు ? 13. ఒక వెబ్ యాప్ సరైన ఆధారాలు లేకుండానే క్రాష్ అవుతోంది, సమస్యను మీరెలా డయాగ్నైజ్ చేస్తారు ? 14. Mars గ్రహం మీద ఒక కాలనీ ఉంది. దాంతో మీరు కమ్యూనికేట్ చేయాలి. మీరు ఎటువంటి సిస్టమ్‌ను బిల్డ్ చేస్తారు ?

15. ఒక extremist రాసిన భాగానికి సంబంధించి లింక్‌ను మీరు తొలగిస్తారా ? 16. ఒక కొత్త థీమ్ పార్క్ రైడ్‌ని డిజైన్ చేయండి. 17. Difficult సహచర వర్కర్‌తో మీరు డీల్ చేసిన time గురించి చెప్పండి. 18. ఒక రెండేళ్ల చిన్నారికి ఒక ఫోన్‌ని డిజైన్ చేయండి ! 19. ఇప్పుడీ స్టేజ్ లో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు, earning or learning? 20. మీ కస్టమర్‌గా ఉండమని చెబుతున్న ఒక కస్టమర్‌తో మీరేం చెబుతారు ?

Admin

Recent Posts