Off Beat

వందే భారత్ రైలులో ప్ర‌యాణం ఎలా ఉంటుంది.. స్వీయ అనుభ‌వం..

రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు జర్నీ బాగానే ఉంది. ఎనిమిది గంటలకు ఎక్కగానే ఏదో జ్యూస్ ప్యాకెట్, తర్వాత రెండు వడ, ఉప్మా, స్వీట్ సేమియా, కొబ్బరి చట్నీ, సాంబార్ తో (సాంబార్ రుచి లేదు), 11.30-12 సమయంలో భోజనం, రెండు రొటీ, పన్నీర్ కర్రీ, ఆకు కూర పప్పు, పెరుగు, ఊరగాయ, ఐస్ క్రీమ్ ఇచ్చారు.

ఆటోమేటిక్ డోర్ కనుక బయటవి కొనడం సాధ్యం కాదు, కేటరింగ్ తో కలిపి టికెట్ తీసుకుంటే మంచిది, సీటింగ్ ఫ్లైట్ పద్దతి లో ఉంది, అక్కడ ఎలా conjested గా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంది. ప్రతీ కోచ్ కి కేటరింగ్ అటెండర్, క్లీనింగ్ వాళ్ళు ఉన్నారు. రాజమండ్రి లో ఉదయం 7.57, విజయవాడ 10.00, హైదరాబాద్ మధ్యాహ్నం 02.15 కు చేరుకుంది.

how is vande bharat train express journey

ఎదుటి సీట్ కింద ఫుట్ రెస్ట్, మన సీట్ కింద చార్జర్ పాయింట్, వైఫై (నేను వాడుకోలేదు), ఫ్లైట్ లో లాగే టిఫిన్, భోజనం చెయ్యడానికి ప్రతీ సీట్ కి ఎదురుగా అమరిక, ఏ ప్లాట్‌ఫారం మీదకి వెళ్తుందో, ప్లాట్ ఫారం ఏ సైడ్ వస్తుందో (మెట్రో లా) అనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే బోర్డ్స్ ఉన్నాయి.

Cleanliness బాగుంది కాని మరీ ప్రతీ వాడు టాయిలెట్ కి వెళ్లిన తర్వాత శుభ్రం చెయ్యలేరు కదా. ఇంకొకటి ఏమిటంటే టాయిలెట్ లో జనాలు ఏమి పడేస్తారో ఏమిటో కాని ఇండియన్ టైపు టాయిలెట్ లో నీళ్లు వెళ్లకుండా నిలిచిపోయాయి.

Admin

Recent Posts