Off Beat

బాడీగార్డ్స్ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వెనుక ఉండే కమాండోలు నల్ల కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తున్నారు. అయితే కమాండోలు నల్ల కళ్లద్దాలు మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు? ఇతర కళ్లద్దాలు ఎందుకు వాడరు? అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. కమాండోలు నల్ల కళ్ళద్దాలు వాడటం వెనుక ఆసక్తికరమైన కారణాలే ఉన్నాయి. యూనిఫామ్ వేసుకుని నల్ల కళ్ళద్దాలతో ఉండే కమాండోలు రాజకీయ నాయకులు సెలబ్రిటీలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తూ ఉంటారు.

అయితే వాళ్లు అలా నల్ల కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం ఏమాత్రం కాదు. వీళ్ళు నల్ల కళ్లద్దాలు ధరించడం వల్ల అవతలి వ్యక్తుల కదలికలను సులభంగా గమనించ గలుగుతారు. అయితే అవతలి వ్యక్తులకు మాత్రం వీళ్ళు ఎటువైపు చూస్తున్నారు అనే విషయం అర్థం కాదు.

why commandos wear black goggles

జనాల్లో ఎవరైనా అనుమానస్పదంగా ప్రవర్తిస్తే వారి కదలికలను సులభంగా కనిపెట్టడానికి కమాండోలు, బాడీగార్డులు నల్ల కళ్లద్దాలను వినియోగిస్తారు. అవతలి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తారు. అంతేకాక ప్రముఖులపై ఎవరైనా అటాక్ చేసిన నల్ల కళ్లద్దాలు ధరిస్తే దుమ్ము, దూళి వల్ల కంటి చూపు డైవర్ట్ కాకుండా ఉంటుంది. సూర్యకాంతి, ఇన్ఫెక్షన్ల సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు. నల్ల కళ్లద్దాలు ధరిస్తే వాతావరణం ఎలా ఉన్నా అవతలి వ్యక్తులను సులభంగా గమనించడం సాధ్యమవుతుంది. అందువల్లే కమాండోలు ఎక్కువగా నల్ల కళ్లద్దాలను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తారు.

Admin