నాకు తెలిసిన ఒకతను వంటలకు సంబంధించింది యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. చూద్దురు రండి అంటే వెళ్ళాను. ఊరికే రుచి చూడడానికి వెళ్లాను.(తేరగా తినడానికి కాదు ). అక్కడికి వెళ్లాక చూస్తే అతను కెమెరా….లైట్ లు పెట్టి…..గంట టైం పట్టింది. తీరా వంట మొదలు పెట్టిన తరువాత మధ్యలో ఎరుపు, నలుపు పెయింట్ లాంటి వాసన వచ్చే దాన్ని స్ప్రే చేశాడు. తర్వాత దాని మీద మైనం లాంటిది పోశాడు. ఎందుకు రా అంటే…అది తినడానికి కాదు చక్కగా వీడియో కనపడడానికి అంటా. బాగా కనపడకుంటే వీక్షకులు చూడరు అంటా…
తరువాత దాన్ని ముందు వెనుకా వీడియో తీసి నీళ్ళతో కలిపి మురికి కాలువలో కలిపాడు. నాకు బాగా కోపం వచ్చింది. తినే తిండి మురికి కాలువలో కలపడం ఏందిరా నీ ముఖం.. ఆ నల్ల రంగు నీ ముఖానికి వేసుకొని నీ నవ రంధ్రాలలో మైనం పోసుకోవలసింది….ఓరి దుర్మార్గుడా…. నీ మీద నమ్మకంతో ఏమి తినకుండా వచ్చాను రా నీ దగ్గరకు అని తిట్టాను.
నాకు ఒకటి అర్థమైంది. యూట్యూబ్ వీడియోలో చేసిన పదార్థాలు తినడానికి కాదు. చూడడానికి మాత్రమే పని చేస్తాయి అని అనిపించింది. ఇంటర్నెట్‌లో కనిపించేదంతా చూడడానికి మాత్రమే. అయితే అందరూ ఇలా చేస్తారు అని కాదు. కొందరు ఇలా చేస్తారు అని చెప్పడమే ఈ పోస్టు ముఖ్య ఉద్దేశం.