Ajwain Leaves Plant : వాము ఆకు మొక్క ఇంట్లో క‌చ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

Ajwain Leaves Plant : మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండ‌డంతోపాటు అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన మొక్కల‌లో వాము ఆకు మొక్క ఒక‌టి. వాము ఆకు మొక్క మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని అలంక‌ర‌ణ కోసం మాత్ర‌మే పెంచుకుంటూ ఉంటారు. మ‌న‌కు వ‌చ్చే వాత‌, క‌ఫ‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంతో స‌హాయ‌ప‌డుతంది. ఈ మొక్కను ఉప‌యోగించి చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు వ‌చ్చే అనేక సాధార‌ణ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సులువుగా త‌గ్గించుకోవ‌చ్చు.

Ajwain Leaves Plant should be in your house know the reason
Ajwain Leaves Plant

ఈ మొక్క‌ను ఔషధంగా వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప‌భ్రావాలు క‌ల‌గ‌వు. చాలా మంది ఈ మొక్క నుండి వాము ల‌భిస్తుంది అని భావిస్తూ ఉంటారు. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే వాము వాసన‌ని ఈ మొక్క క‌లిగి ఉంటుంది. క‌నుక ఈ మొక్క‌కు వాము ఆకు మొక్క అని పేరు వ‌చ్చింది. అంతే కానీ ఈ మొక్క నుండి వాము మ‌న‌కు ల‌భించ‌దు. సాధార‌ణంగా వ‌చ్చే ద‌గ్గును త‌గ్గించడంలో వాము మొక్క ఎంతో స‌హాయప‌డుతుంది. ఈ మొక్క ఆకుల‌ను ఉప్పుతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

కీళ్ల నొప్పులు, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ వాము మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జ్వ‌రం, త‌ల‌నొప్పి, జ‌లుబు, అలర్జీలు వంటివి త‌గ్గుతాయి. ఈ ఆకుల ర‌సాన్ని వేడి నీటితో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో నులి పురుగులు న‌శిస్తాయి.

ఈ మొక్క ఆకుల‌కు ఆక‌లిని పెంచే శక్తి కూడా ఉంది. మూత్ర పిండాల‌లో రాళ్లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వంటి వాటిని న‌యం చేయ‌డంలోనూ ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకుల‌తో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల అర్ష మొల‌ల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. వాము ఆకు మొక్క ఆకుల‌ను పొడిగా చేసి మిరియాల పొడితో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌లో వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts