Strong Bones : ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నల్లేరు మొక్క కూడా ఒకటి. ఇది తీగ జాతికి చెందిన మొక్క.ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి, ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనిని వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంయోజిత అని నిలుస్తూ ఉంటారు. విరిగిన ఎముకలను అతికించే శక్తి ఈ మొక్కకు ఉంటుంది. మన శరీరంలో ఉండే ఎముకలను దృఢంగా ఉంచడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడడుతుంది. నల్లేరు తీగను చాలా మంది చూసే ఉంటారు. చెట్లకు, కంచెలకు అల్లుకుని ఈ మొక్క 10 మీటర్ల వరకు పాకుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను చాలా మంది అలంకరణ కోసం పెంచుకుంటున్నారు. ఈ తీగ కాడలు నాలుగు పలకలుగా ఉంటాయి. కణుపుల వద్ద ఆకులు ఉంటాయి.
ఈ మొక్క కాడను చేతులతో నలిపితే చేతులకు దురదల వస్తాయి. వీటి కాడను తీసేటప్పుడు చేతులకు నూనెను రాసుకోవాలి. లేకపోతే చేతులకు దురదలు వస్తాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తీగ మొక్కలో కాల్షియం, బీటాకెరోటీన్, ఆగ్జాలిక్ ఆమ్లం, ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. నల్లేరు మొక్కతో పచ్చడిని, పులుసు కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్కతో పచ్చడిని చేసుకుని లేదా ఈ మొక్క గుజ్జును ఒక టీ స్పూన్ మేతాదులో తింటూ ఉండడం వల్ల విరిగిన ఎముకలు అతుక్కుంటాయి.
అదే విధంగా నల్లేరు మొక్కను మగ్గించి దాని నుండి రసాన్ని తీసి ఆ రసానికి సమానంగా ఆవు నెయ్యిని కలిపి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకోవాలి. ఈ నెయ్యిని పూటకు ఒక టీ స్పూన్ మోతాదులో ఒక కప్పు ఆవు పాలలో కలుపుకుని తాగుతూ ఉంటే విరిగిన ఎముకలు అతుక్కుటాయి. నల్లేరు మొక్కను దోరగా వేయించి గుజ్జును పాలలో కలుపుకుని తాగడం వల్ల, ఈ గుజ్జును విరిగిన ఎముకలపై పూతగా రాయడం వల్ల విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. ఈ మొక్క గుజ్జును తినడం వల్ల కొండనాలుక, కోరింత దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్కను నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని కూరల్లో వేసుకోవడం వల్ల అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకుని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా నల్లేరు పొడిని ఉపయోగించడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. మొలల వ్యాధి తగ్గుతుంది. శరీరంలో జీవక్రకియ రేటు కూడా పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. స్త్రీలలో వచ్చే సంతాన సమస్యలను నయం చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్లేరు మొక్కను నిప్పుల మీద వేసి ఉడికించి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి నువ్వుల నూనెను, మరలా నల్లేరు పచ్చి రసాన్ని కలిపి నెలసరి వచ్చిన ఐదవ రోజున తాగడం వల్ల సమస్యలు తగ్గి సంతానం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్త్రీలలో నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
నల్లేరు ఆకులను, కాడలను నిప్పుల మీద ఉడికించి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి 15 గ్రా. ల నెయ్యిని, పంచదారను కలిపి తీసుకుంటూ ఉంటే నెలసరి క్రమం తప్పకుండా వస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలలో నెలసరి సమయంలో అధిక రక్త స్రావం అవుతూ ఉంటుంది. నల్లేరు మొక్క రసానికి గంధాన్ని, ఆవు నెయ్యిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల అధిక రక్త స్రావం సమస్య తగ్గుతుంది. నల్లేరును నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడితో డికాషన్ ను చేసుకుని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. రెండు కణుపుల నల్లేరు తీసుకుని శుభ్రంగా కడిగి అన్నాన్ని వండేటప్పుడు అందులో వేసి అన్నాన్ని వండుకోవాలి. ఇలా వండిన అన్నాన్ని తినడం వల్ల ఎముకల సమస్యలు తగ్గి ఎముకలు దృఢంగా, ఉక్కులా మారతాయి. ఈ విధంగా నల్లేరును ఉపయోగించి మనకు వచ్చే ఎముకల సంబంధిత సమస్యలను, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.