అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆలుగ‌డ్డ‌ల‌ను తింటే బ‌రువు పెరుగుతారేమోన‌ని భ‌యంగా ఉందా.. అయితే ఇది చ‌ద‌వండి..!

పొటాటో ప్రియులకు ఓ శుభవార్త. బంగాళాదుంపతో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు పెరగుతారంటూ ఇప్పటి వరకు ఉన్న ప్రచారం తప్పు అని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పొటాటోతో చేసే చిప్స్ వంటి చిరు తిళ్లు తినడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతాయని భావిస్తున్నారా? అలాందేమీ లేదని కొత్త స్టడీ తేల్చేసింది.

బరువు తగ్గేందుకు బంగాళాదుంపలను తీసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బంగాళాదుంపలు సైతం కెలోరీల శాతాన్ని తగ్గిస్తాయని యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. బంగాళాదుంపలతో ఆరోగ్యానికి మేలేనని, బరువు తగ్గించే ప్రక్రియలోనూ బంగాళదుంపలు ఉపయోగపడుతాయ‌ని చెబుతున్నారు.

if you are fearing about potato weight gain know this

దాదాపు 12 వారాల పాటు భారీ బరువు గల మహిళలు, పురుషులపై జరిపిన పరిశోధనలో బంగాళాదుంపలను తీసుకోవడం ద్వారా కెలోరీల శాతం తగ్గుముఖం పట్టడం, రక్తంలో సుగర్ లెవల్స్, కార్బోహైడ్రేడ్లను నియంత్రిస్తున్నట్లు తెలియవచ్చింది. ఒక బంగాళాదుంపలో 110 కెలోరీలు, పొటాషియం 620 గ్రాములున్నట్టు గుర్తించారు. అయితే వేయించుకుని కాకుండా ఉడ‌క‌బెట్టి తింటే మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.

Admin

Recent Posts