ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఆట క్రికెట్. క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ అంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు కొంతమంది. అయితే క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో ఒక భాగం కాదు. దీని కారణంగానే చైనా దేశం క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అంతేకాకుండా చైనా క్రికెట్ ఆడక పోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఏంటంటే చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు.
క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడూ ఒక సమయంలో బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. చైనాలో ఎక్కువగా బ్యాడ్మింటన్ మరియు టేబుల్ టెన్నిస్ బాగా ఆడతారు. ఈ రెండు ఆటలు ఒలంపిక్స్ లోకి వస్తాయి. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్స్ కిందకు రాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్లో పాల్గొంటాయి. చైనా క్రికెట్ ఆడక పోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
అయితే చైనాకు క్రికెట్ టీం కూడా ఉంది. 2009 సంవత్సరంలో ఏసీసీ ట్రోఫీ చాలెంజ్ లో ఈ జట్టు పాల్గొంది. కానీ మొదటి మ్యాచ్లలో ఓడిపోయింది తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసుకుంది చైనా దేశం. అంతేకాకుండా icc చైనాలో కూడా క్రికెట్ ను ప్రమోట్ చేస్తోంది. 2019 లో జరిగిన t20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్లో చైనా మహిళల జట్టు కూడా పాల్గొని విజయం సాధించింది.