technology

మీరు వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ కవర్‌ కలర్‌ మారిందా.. ఎందుకో తెలుసుకోండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">మెుబైల్‌ ఫోన్‌ ఇప్పుడు ఒక నిత్యావసరంగా మారిపోయింది&period; ఫోన్‌ చేతిలో లేకపోతే&period;&period; ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలవటం పరిపాటిగా మారింది&period; అందుకే చిన్నా&comma; పెద్దా తేడా లేకుండా&comma; వయసుతో సంబంధం లేకుండా అందరి చేతుల్లో ఇప్పుడు మెుబైల్‌ ఫోన్స్‌ దర్శనం ఇస్తున్నాయి&period; మరి అంత ఇంపార్టెంట్‌ అయిన ఈ ఫోన్‌ను అంతే భద్రంగా కాపాడుకోవటానికి&comma; వివిధ రంగుల్లో&comma; వివిధ ఆకృతుల్లో మెుబైల్‌ ఫోన్‌ బ్యాక్‌ కవర్లు అందుబాటులో ఉన్నాయి&period; ఫోన్‌కు ఎటువంటి డ్యామేజ్‌ కాకుండా ఈ కవర్‌ కాపాడుతుంది&period; మిక్కీమౌస్‌ నుంచి ఇష్టమైన వారి ఫోటోలను సైతం మెుబైల్‌ కవర్స్‌ మీద వేయించుకోవటం చూశాం&period; కానీ ఇప్పుడు ఫోన్‌ కలర్‌&comma; అండ్‌ స్లిప్‌నెస్‌ కనిపించటం కోసం ఎంతోమంది ట్రాన్స్‌పరెంట్‌ పౌచ్‌లను వాడటం మెుదలుపెట్టారు&period; కానీ&comma; ఫోన్‌కు పెట్టిన కొన్ని రోజులకే యెల్లో కలర్‌ వచ్చేస్తుంది&period; ఎందుకు ఇలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ట్రాన్స్‌పరేంట్ కవర్‌లను TPU &lpar;థర్మో ప్లాస్టిక్‌ పాలీ యురేథిన్‌&rpar; మెటీరియల్‌తో తయారు చేస్తారు&period; ఎక్కువుగా ఇవి కలర్‌ మారటానికి కారణం సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలే&period; సూర్యుడి నుంచి వచ్చే కిరణాలకు కవర్‌లోని టీపీయూ కెమికల్స్‌ రియాక్ట్‌ అవ్వటంతో&comma; రంగు మారటం ప్రారంభం అవుతుంది&period; అదేవిధంగా ఫోన్‌ ఎక్కువుగా వాడినప్పుడు ఫోన్‌ వేడక్కటం వల్ల&comma; ఛార్జింగ్‌ పెట్టినప్పుడు వచ్చే వేడివల్ల రంగు మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85291 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mobile-phone-pouch&period;jpg" alt&equals;"if your mobile phone cover color is changed do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేగాకుండా చేతి నుంచి వచ్చే చెమట&comma; మన చేతి వేడిమి వల్ల సైతం కవర్‌ కలర్‌ మారుతుంది&period; రంగు మారిన పౌచ్‌ను మళ్లీ పాత రంగులోకి మారాలంటే రెండు నుంచి మూడు చుక్కల వాష్‌ సోప్‌ను వేడి నీటిలో వేయండి&period; ఆ నీటితో పౌచ్‌ను వేసి&comma; పాత బ్రష్‌తో సున్నితంగా రుద్ది&comma; నీటితో కడిగేయండి&period; మళ్లీ మీ పౌచ్‌ పాత రంగులోకి వచ్చేస్తుంది&period; ఒకవేళ వాష్‌ సోప్‌ అందుబాటులో లేకపోతే&comma; బేకింగ్‌ సోడాను క్రీమ్‌లా వచ్చేలా నీటితో కలిపి&comma; ఆ క్రీమ్‌ను కవర్‌పై వేసి బ్రష్‌తో నెమ్మదిగా రుద్దితే&comma; తళతళమని ట్రాన్స్‌పరెంట్‌ కలర్‌లోకి మారిపోతుంది&period; మీరూ ట్రై చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts