viral news

ప్రేమంటే ఇదేరా.. భార్య మేడపై నుంచి పడిపోవడం చూసి.. ఈ భర్త చేసిన పని..

భార్యాభర్తలు ఇంటి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మేడపై ఉన్న భార్య ప్రమాదవశాత్తు కిందపడింది. భార్య కిందపడడాన్ని చూసిన భర్త చివరకు ఏం చేశాడో చూడండి..

చాలా మంది దంపతుల్లో వివాహమైన కొత్తలో ఉన్న అన్యోన్యత ఆ తర్వాత ఉండదు. అయితే కొందరు మాత్రం జీవితాంతం ఒకరిపై ఇంకొందరు అదే ప్రేమను కనబరుస్తుంటారు. అంతేకాదు ఒకరికి కష్టం వచ్చిందంటే.. ఇంకొకరు తట్టుకోలేరు. అవసరమైతే తమ ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడరు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. భార్య మేడ పైనుంచి పడడం చూసి చివరకు భర్త చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన వారంతా ఆ భర్తను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

man jumped from building upon seeing wife

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇంటి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మేడపై ఉన్న భార్య ప్రమాదవశాత్తు కిందపడింది. భార్య కిందపడడాన్ని చూసిన భర్త.. ముందూ వెనుకా చూడకుండా తాను కూడా పైనుంచి కిందకు దూకేశాడు.

కిందపడి విల్లవిల్లాడుతున్న భార్య పక్కనే తాను కూడా దూకేశాడు. కిందకు దూకిన వెంటనే బ్యాలెన్స్ చేసుకుని పైకి లేచాడు. వెంటనే పరుగెత్తుకుంటూ తన భార్య వద్దకు వెళ్లాడు. భార్యను చేతులతో పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేశాడు. తన భార్యకు ఏమైందో అని కంగారుతో పాటూ తన ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా తనను రక్షించుకోవాలనే తపన అతడిలో కనిపించింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ భర్త తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు’.. అంటూ కొందరు, ‘దంపతులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 3.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Admin

Recent Posts