business

అంబానీ వంటి పెద్ద వ్యాపారవేత్తలు వారి వ్యాపార లావాదేవీలను ఎలా చూసుకుంటారు?

అంబానీలు, టాటా లు, బిర్లాలు, సింఘానియలు, గోద్రెజ్ లు, శివనాడార్, అజీమ్ Premji, TVS ayyangaarlu, Narayana మూర్తి.. ఇలా ఏ ఒక్క విజయవంతమైన పారిశ్రామిక, వ్యాపార వేత్తను మనం పరిశీలించి చూస్తే.. ఈ వ్యాపార సామ్రాజ్యాల ప్రారంభ దశ లోని వ్యక్తులు ఒక గొప్ప వేదాంత సూత్రాన్ని ఆకళింపు చేసుకున్నారని అనిపిస్తుంది. ఆ సూత్రం ఏమిటి?? సహనా వవతు..సహనౌ భునక్తు..సహా వీర్యం కరవా వహే…. స్తూలం గా దీని అర్దం..కలిసి ఉందాం, కలిసి పని చేద్దాం, కలిసి తిందాం.. ఇలా.. పది మందికి తిండి పెట్టి, వారి శక్తి యుక్తులను వాడుకుంటూ, తమ లాభాలను నలుగురితో పంచుకుంటూ వ్యాపారం చేయడం వీళ్ళందరి common strength.

నేను, నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకున్న ఏ వ్యాపారవేత్త అయినా.. ఒకటి, రెండు తరాలతో ఫినిష్!! ఇక ప్రశ్నకు వస్తే.. లావా దేవీ లను ఎలా చూసుకుంటారు? ప్రతి రూపాయి నష్టపోకుండా ఎలా చూసుకుంటారు?? ఈ పెద్ద వ్యాపారస్తులు అనేక అంచెల్లో నమ్మకస్తుల‌ను పెట్టుకుని వాళ్ళ మీద బరువు, బాధ్యత మోపి తాము పై స్థాయి లో చూసుకుంటారు.. ఒక విధంగా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఈపెద్దల వ్యాపారం. అంటే పునాదులు బలంగా, విస్తృతంగా ఉంటాయి. పై స్థాయి లో ముకేష్ అంబానీ అయినా.. ఇంకెవరైనా చేసేది.. కర్ర పెత్తనం మాత్రమే!

how big industrialists manage their businesses

రూపాయి నష్టపోకుండా..ఎలా చూసుకుంటారు అనా మీ సందేహం??రూపాయి నష్టపోయే పరిస్తతి వచ్చినా.. వీరు అదరరు.. బెదరరు. గమనించండి.. అంబానీ .. బిజినెస్ ఎంపైర్ లో కూడా నష్ట దాయక విభాగాలు ఉన్నాయి.. అలాగే టాటా లు.. వారి ఆటో ప్రొడక్ట్స్ అయిన నానో, landrover.. నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.. అంబానిల టెక్స్టైల్ business లో నష్టాలు తప్పడం లేదు.. ఇటువంటి పెద్ద గ్రూప్ ల balance sheet, p & l స్టేట్మెంట్స్ చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. అయితే.. నష్టాలు వస్తున్న విభాగంలో ఎక్కువ శ్రద్ద చూపడం కానీ, లేక వేరే లాభసాటి వ్యాపారం లోకి అడుగు పెట్టడం కానీ.. ఈ మహానుభావులు చేస్తూ ఉంటారు. అందుకే.. ఈ పెద్ద బ్రాండ్ నేమ్ స్థిరంగా ఉంటుంది. మన తెలుగు వారిలో రామోజీ రావు కూడా విజయవంతమైన వ్యాపారవేత్త .

Admin

Recent Posts