ఆధ్యాత్మికం

Ravi Aku Deepam : రావి ఆకులతో ఇలా చేస్తే చాలు.. పాపాలు, దోషాలు, శాపాలు పోతాయి.. ధనం సంపాదిస్తారు..!

Ravi Aku Deepam : హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రావి చెట్టును చాలా మంది పూజిస్తుంటారు. రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలసి ఉంటాయి. ఆ రెండింటినీ భక్తులు పూజిస్తారు. ఇక రావి చెట్టును సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. అందుకనే పూజలు చేస్తారు. అయితే రావి చెట్టు ఆకులతో అనేక దోషాలను తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి వాటిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి.

do like this with ravi aku to remove problems

రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరం దేవుడి ముందు పరచాలి. వాటిపై ఒక ప్రమిదను పెట్టాలి. అనంతరం అందులో నువ్వుల నూనె పోయాలి. దాంతో దీపం వెలిగించాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేయాలి. దీంతో అనుకున్న కార్యాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. అలాగే పూర్వ జన్మల పాపాల నుంచి బయట పడవచ్చు. కర్మ ఫలితాన్ని తొలగించుకోవచ్చు. అలాగే శాప దోషాలు, ఇతర దోషాలు ఉండవు. దీంతో అన్ని సమస్యల నుంచి బయట పడతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుణ విముక్తులు అవుతారు. ధనం బాగా సంపాదిస్తారు. కనుక రావి ఆకులతో పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో అంతా శుభమే జరుగుతుంది.

Admin

Recent Posts